ETV Bharat / sitara

సందీప్​ 'వివాహ భోజనంబు' రెడీ అవుతోందా..? - వివాహ భోజనంబు సినిమా

టాలీవుడ్​ యంగ్​ హీరో సందీప్​ కిషన్​ నిర్మాణంలో మరో చిత్రం రాబోతుంది. 'వివాహ భోజనంబు' అనే టైటిల్​తో సినిమాను నిర్మించనున్నట్లు సోషల్​మీడియాలో ప్రకటించాడీ హీరో.

Sundeep Kishan to produce 'Vivaha Bhojanambu'
'వివాహ భోజనంబు'కు సిద్ధం అవ్వండి: సందీప్​
author img

By

Published : Aug 18, 2020, 9:16 AM IST

కథానాయకుడు సందీప్​ కిషన్​లో చక్కని నటుడు, నిర్మాతతో పాటు మంచి భోజన ప్రియుడూ ఉన్నారు. ఈ అభిరుచితోనే ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో 'వివాహ భోజనంబు' పేరుతో రెస్టారెంట్లు ప్రారంభించి సేవలందిస్తున్నారు. ఇప్పుడాయన ఇదే 'వివాహ భోజనంబు' పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు.

  • I got atleast a 100 calls & 1000+ messages asking me if I was going to get married...😂
    It’s funny how the emotion in most of the calls varied from Shock to Laughter...
    & No,not planning on getting married anytime Soon 🤟🏽#Sk #SingleKing #VivahaBhojanambu

    Guess the hero ? 😉 pic.twitter.com/zxfUHOLZpg

    — Sundeep Kishan (@sundeepkishan) August 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నిను వీడని నీడని నేను', 'ఏ1 ఎక్స్​ప్రెస్​' చిత్రాల తర్వాత ఆయన నిర్మాణంలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. శినిష్​ అనే మరో నిర్మాతతో కలిసి ఈ కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నారు సందీప్​. సోమవారం ఈ సినిమా ప్రీ-లుక్​ను విడుదల చేశారు. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా చిత్రాన్ని రూపొందించనున్నట్లు పోస్టర్​ ద్వారా తెలియజేసింది చిత్రబృందం.

రామ్​ అబ్బరాజు దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. త్వరలోనే ఫస్ట్​లుక్​తో పాటు చిత్ర నాయకానాయికలు, ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రానికి కూర్పు ఛోటా.కె.ప్రసాద్​, ఛాయాగ్రహణం మణికందన్​ అందించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.