'సుబ్రహ్మణ్యపురం', 'ఇదంజగత్' వంటి థ్రిల్లర్స్‌తో ఆకట్టుకున్నాడు హీరో సుమంత్. ఇప్పుడదే జానర్లో 'కపటధారి' అనే సినిమా చేస్తున్నాడు. కింగ్ నాగార్జున సోమవారం.. టైటిల్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. కన్నడ సూపర్‌హిట్ 'కావలుధారి'కి రీమేక్ ఈ చిత్రం. పూర్తిస్థాయి క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
పోలీస్ అధికారిగా సుమంత్ కనిపించనున్నాడు. హత్యకు గురైన ఓ కుటుంబాన్ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. నాజర్, నందిత, పూజా కుమార్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైమన్ కె.కింగ్ సంగీతమందిస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే చెన్నైలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: మలయాళ హిట్ రీమేక్‌లో హీరో సుమంత్