ETV Bharat / sitara

'వి' షూటింగ్​లో సుధీర్​ స్టన్నింగ్​ లుక్స్​.. అదుర్స్​ - 'వి' షూటింగ్

'వి' సినిమా చిత్రీకరణ సమయంలో వర్కౌట్​ చేసిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు హీరో సుధీర్​బాబు. ఈ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

Sudheer Babu
'వి' షూటింగ్​
author img

By

Published : Sep 13, 2020, 2:03 PM IST

టాలీవుడ్​ యంగ్​ హీరో సుధీర్​బాబు.. ఫిట్​నెస్​కు ఇచ్చే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం భిన్నమైన, కష్టంగా ఉండే కసరత్తులు చేసి వాటిని అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఎంట్రీ సీన్​లో​..​ సుధీర్​పై ప్లాన్​ చేసిన యాక్షన్​ సీక్వెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. సిక్స్​ ప్యాక్​తో చేతిలో తుపాకీ పట్టుకొని ప్రత్యర్థులపై ​విరుచుకుపడతారు.

తాజాగా ఆ సన్నివేశం చిత్రీకరణలో రెండు డంబుల్స్​ పట్టుకొని వర్కౌట్​ చేసిన ఫొటోలను.. ట్విట్టర్​ పోస్ట్​ చేశారు సుధీర్​. ప్రస్తుతం వైరల్​గా మారిన ఆ స్టిల్స్​... నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్​లో విడుదలైంది 'వి' సినిమా. ఇందులో నాని, నివేదా థామస్​, అదితి రావ్​ హైదరీలు కీలక పాత్ర పోషించారు. మోహన్​ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు.

ఇదీ చూడండి 'వి' రివ్యూ: సైకో విలన్​గా నాని ఎలా చేశాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.