స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అగ్ర దర్శకుడు తివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా నుంచి తాజాగా మరో పాట టీజర్‌ను గురువారం(నవంబర్ 14న) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. 'ఓఎంజీ డాడీ' టైటిల్‌తో సాగే సాంగ్ టీజర్‌ను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. ఇందులో అతిథులుగా బన్నీ పిల్లలు అర్హా, అయాన్ కనిపిస్తారని సమాచారం.
-
Here it is #OMGdaddy !! From #AlaVaikunthapurramloo #AlaVaikunthapurramloothirdsingle #OMGdaddysongteaser at 10:AM TOM morning on the occasion of #ChildrensDay We dedicate this to all the lovely fathers out there get ready guys to #OMGDATTACK
— thaman S (@MusicThaman) November 13, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
🎧💨💨🎶🎵♥️ pic.twitter.com/dcHyudNtuN
">Here it is #OMGdaddy !! From #AlaVaikunthapurramloo #AlaVaikunthapurramloothirdsingle #OMGdaddysongteaser at 10:AM TOM morning on the occasion of #ChildrensDay We dedicate this to all the lovely fathers out there get ready guys to #OMGDATTACK
— thaman S (@MusicThaman) November 13, 2019
🎧💨💨🎶🎵♥️ pic.twitter.com/dcHyudNtuNHere it is #OMGdaddy !! From #AlaVaikunthapurramloo #AlaVaikunthapurramloothirdsingle #OMGdaddysongteaser at 10:AM TOM morning on the occasion of #ChildrensDay We dedicate this to all the lovely fathers out there get ready guys to #OMGDATTACK
— thaman S (@MusicThaman) November 13, 2019
🎧💨💨🎶🎵♥️ pic.twitter.com/dcHyudNtuN
ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'సామజవరగమన', 'రాములో రాముల' పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వీక్షణలతో దూసుకెళ్తున్నాయి.
బన్నీ 19వ చిత్రంగా 'అల వైకుంఠపురములో' తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయిక. టబు, జయరాం, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' వంటి హిట్ చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. ఫలితంగా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.