ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి నెట్టింట సందడి చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా తన ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న ఈ యంగ్‌హీరో.. తాజాగా నలుపు దుస్తుల్లో తీసుకున్న ఫొటోలు షేర్ చేశాడు. వాటికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
'ఇస్మార్ట్ శంకర్' విజయం తర్వాత 'రెడ్' చిత్రంతో బిజీగా ఉన్నాడు రామ్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి.. స్రవంతి రవికిషోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో మంచి విజయం సాధించిన 'తడమ్' చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ కథానాయికలు. కరోనా పరిస్థితుల రీత్యా ఏప్రిల్ 9న విడుదల కావాల్సిన సినిమా.. 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.