ETV Bharat / sitara

'పుష్ప'లో 6 నిమిషాల ఫైట్​కు అన్ని కోట్లా? - 6 crores budget inpushpa

'పుష్ప'లోని ఓ ఫైట్​ను సుమారు రూ.6 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించనున్నారట. లాక్​డౌన్​ ఎత్తివేయగానే దీనికి సంబంధించిన చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో లారీ డ్రైవర్​గా కనిపించనున్నాడు బన్నీ.

Stunning budget for pushpa 6 minute action sequence
పుష్ప సినిమాలో బన్నీలుక్​
author img

By

Published : May 7, 2020, 11:18 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​-దర్శకుడు సుకుమార్ కాంబినేషన్​లో తీస్తున్న హ్యాట్రిక్​ సినిమా 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తెరకెక్కిస్తున్నారు. లాక్​డౌన్​ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రంలోని కీలకమైన ఓ ఫైట్​ కోసం పెడుతున్న బడ్జెట్​ సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

ప్రస్తుత పరిస్థితి సర్దుకోగానే బన్నీతో ఈ భారీ యాక్షన్​ సీక్వెన్స్​కు తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది చిత్రబృందం​. 6 నిమిషాల నిడివి ఉండే ఈ సీన్ కోసం దాదాపు రూ.6 కోట్ల బడ్జెట్​ను నిర్ణయించారని టాక్ వినిపిస్తోంది. తొలుత దీనిని విదేశీ స్టంట్​ కొరియోగ్రాఫర్స్​తో తీయాలని అనుకున్నా, కరోనా ప్రభావం వల్ల ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ స్టంట్​ కొరియోగ్రఫర్స్​తోనే ఈ ఫైట్​ను రూపొందించాలని నిర్ణయించారు.

ఈ సినిమాలో రష్మిక మందణ్న హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

pushpa
'పుష్ప' పోస్టర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.