బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput death) కేసులో అతడి ఫ్లాట్మేట్ సిద్దార్థ్ పితాని(siddharth pithani) అరెస్టయ్యాడు. ఎన్సీబీ అధికారులు అతడిని హైదరాబాద్‌లో నేడు అరెస్ట్ చేశారు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్యకు ముందు సిద్దార్థ్తోనే సుశాంత్ చివరిసారిగా మాట్లాడినట్లు పోలీసులు వెల్లడించారు.
సుశాంత్ ఆత్మహత్య కేసుతో పాటు డ్రగ్స్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్దార్థ్‌ను ఇప్పటికే పలుమార్లు విచారించారు ఎన్సీబీ అధికారులు. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఈ కేసులో అకస్మాత్తుగా సిద్దార్థ్‌ను అరెస్ట్ చేయడం పట్ల మరోసారి బాలీవుడ్లో కలకలం రేగుతోంది.