తొలిసారి 'గబ్బర్ సింగ్'లో జంటగా కనిపించి విజయాన్ని అందుకున్నారు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ - శ్రుతిహాసన్. ఆ తర్వాత 'కాటమ రాయుడు'తో మరోసారి సందడి చేశారు. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్ కుదిరే అవకాశం ఉంది. పవన్ లాయర్‌గా నటిస్తున్న చిత్రం 'వకీల్‌సాబ్'. ఇందులోని ఓ కీలకపాత్ర కోసం శ్రుతిని సంప్రదించినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే ఓ కీలక ఘట్టంలో నటించేందుకు ఈ భామను ఎంపిక చేయనున్నట్లు టాక్. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. బోనీ కపూర్ సమర్పిస్తున్నారు. మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం.. ఈ సినిమాలోని 'మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ' అనే లిరికల్ గీతాన్ని విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రచన చేశారు. తమన్ సంగీతమందిస్తే సిద్ శ్రీరామ్ పాడాడు.
ఇదీ చూడండి: ట్రెండ్ మారుస్తోన్న చరణ్.. కొత్త దర్శకుడితో సినిమా!