సాధారణంగా హీరోహీరోయిన్లు కనిపిస్తే సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు అభిమానులు. ఓ సెల్ఫీకి మహా అయితే 5, 6 సెకన్లు పడుతుందోమో, కానీ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా నిమిషం పాటు వేధించాడు. అతడి సెల్ఫీ బాధితురాలు ఎవరో కాదు... దివంగత నటి శ్రీదేవి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అతిలోకసుందరితో సెల్ఫీ దిగేందుకు పదే పదే తిరుగుతూ.. విసుగు తెప్పించాడు మనీశ్. అయితే చూసే వారికి మాత్రం చక్కటి వినోదం దొరుకుతుంది. ఎట్టకేలకు శ్రీదేవితో సెల్ఫీ తీసుకుంటాడు మనీశ్. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
పాతదైన ఈ వీడియో మంగళవారం శ్రీదేవి జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో మళ్లీ చక్కర్లు కొడుతోంది.
కాస్ట్యూమ్ డిజైనర్‌గా బాలీవుడ్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు మనీశ్.
ఇది చదవండి: రామోజీ ఫిల్మ్‌సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్