'ప్రపంచానికి మనల్ని చూపించేది అమ్మ అయితే ప్రపంచాన్నే మనకు చూపించేది నాన్న' అని నాన్న గొప్పతనం తెలియజేశాడు సుధీర్. ఈ ఆదివారం (జూన్ 20) ఫాదర్స్ డే సందర్భంగా 'శ్రీదేవీ డ్రామా కంపెనీ' కార్యక్రమంలో నాన్నకు ప్రేమతో అనే ఎపిసోడ్‌ని రూపొందించాడు. తమ తండ్రితో కలిసి ఈ షోకి విచ్చేశారు బుల్లెట్ భాస్కర్, నూకరాజు, నరేశ్ తదితరులు. నాన్నతో వాళ్లకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.
ఈ నేపథ్యంలో రష్మీని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్? అని బుల్లెట్ భాస్కర్ తండ్రి సుధీర్‌ను అడగటం సరదాగా సాగింది. నూకరాజు, ఆదిల అల్లరి నవ్వులు పూయిస్తుంది. ముఖ్య అతిథిగా వచ్చిన నటి ఇంద్రజ డ్యాన్సు అలరిస్తోంది. మరి ఈ హంగామా అంతా చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...
- " class="align-text-top noRightClick twitterSection" data="">