ETV Bharat / sitara

ఈ సినిమా చూస్తే పాత రోజులు గుర్తొస్తాయి: డైరెక్టర్ శ్రీహర్ష - sankranthi release telugu movies

Rowdy boys movie: 'రౌడీబాయ్స్' చిత్రవిశేషాలను చెప్పిన డైరెక్టర్ శ్రీహర్ష.. ఈ సినిమా పాతరోజుల్ని గుర్తుకుతెస్తుందని అన్నారు. కాలేజీ రోజుల్లో చూసిన అనుభవాలతో దీనిని తెరకెక్కించానని చెప్పారు.

rowdy boys movie
రౌడీబాయ్స్ మూవీ
author img

By

Published : Jan 12, 2022, 7:31 AM IST

"దర్శకుడిగా అన్ని రకాల జానర్లు చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా వాస్తవికత నిండిన కథల్ని వాణిజ్యాంశాలతో మిళితం చేసి చెప్పడమంటే నాకెంతో ఇష్టం" అన్నారు శ్రీహర్ష కొనుగంటి. 'హుషారు' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన దర్శకుడాయన. ఇప్పుడు నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ను హీరోగా పరిచయం చేస్తూ 'రౌడీ బాయ్స్‌' తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శ్రీహర్ష.

'హుషారు' విజయం తర్వాత నిర్మాత దిల్‌రాజు గారి నుంచి పిలుపొస్తే వెళ్లి కలిశా. 'కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఏదైనా కథ ఉందా?' అని అడిగారు. ఉందని చెప్పా. మరుసటి రోజు వెళ్లి ఆయనకు కథ మొత్తం చెప్తే బాగుంది సినిమా చేద్దామన్నారు. నిజానికి అప్పటికి నాకు ఆశిష్‌తో ఈ కథ చేయబోతున్నానని తెలియదు. రెండు నెలలు కథపై కూర్చొని.. పూర్తి స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాకే రాజుగారు ఆశిష్‌తో చేయబోతున్నట్లు చెప్పారు. తర్వాత తనని కలిసి మాట్లాడా. నా కథలో హీరో పాత్రకున్న లక్షణాలన్నీ తనలో కనిపించాయి. కచ్చితంగా ఈ కథకు తను న్యాయం చేస్తాడన్న నమ్మకం కలిగింది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది.

rowdy boys movie
'రౌడీబాయ్స్' మూవీ

* కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. ప్రతి కుర్రాడికీ 17-18ఏళ్ల వయసున్నప్పుడు పరిణతి అనేది ఉండదు. ఆ వయసులో వాళ్లు చాలా వైల్డ్‌గా ఉంటారు. తెలిసీ తెలియక చాలా తప్పులు చేస్తుంటారు. కానీ, ఓ వయసొచ్చాక తిరిగి వెనక్కి చూసుకుంటే.. ‘ఇన్ని అల్లరి పనులు చేశామా?’ అనిపిస్తుంది. ఇలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో చూపించాం. ఆ రౌడీనెస్‌ సినిమాలో ఉంది కాబట్టే.. ఈ చిత్రానికి ‘రౌడీ బాయ్స్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వాళ్ల పాత రోజులు గుర్తొస్తాయి.

* అందరూ ఈ చిత్రాన్ని ‘ప్రేమదేశం’తో పోలుస్తున్నారు కానీ, దానికీ దీనికి ఏమాత్రం పోలిక ఉండదు. కాలేజీ రోజుల్లో నా నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకునే ఈ కథ రాసుకున్నా. సినిమాలో చూపించినట్లు మా కాలేజీలో కూడా ఓవైపు ఇంజనీరింగ్‌ క్యాంపస్‌.. మరోవైపు మెడికల్‌ క్యాంపస్‌ ఉండేది. సినిమాలో కనిపించే గ్యాంగ్‌ల హంగామా, అల్లర్లు మా కాలేజీ రోజుల్లో నేను చూసినవే. వీటిని ఎంతో వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేశాం.

* ఈ చిత్రంలో ఆశిష్‌ చాలా బాగా నటించాడు. డ్యాన్సులు ఎంతో చక్కగా చేశాడు. సినిమా చూస్తున్నంత సేపూ ఓ కొత్త అబ్బాయి చేస్తున్నాడని ఏమాత్రం అనిపించదు. అనుభవమున్న నటుడిలా చేశాడు. ఇందులో కథానాయిక పాత్రకు ఎంతో ప్రాధాన్యముంది. హీరో పాత్ర ఎంత రఫ్‌గా ఉంటుందో.. నాయిక అంత మెచ్యూర్డ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రకు తెలుగు వచ్చిన వాళ్లు అయితే చాలా బాగుంటుందనిపించింది. ఈ కోణంలో ఆలోచిస్తున్నప్పుడు..అనుపమ పరమేశ్వరన్‌ గుర్తొచ్చింది. తర్వాత తనని సంప్రదించి కథ చెప్తే.. ‘బాగుంది నేను చేస్తాను’ అంది. అలా ఆమె ఈ చిత్రంలోకి వచ్చింది.

rowdy boys movie
'రౌడీబాయ్స్' మూవీ

* ఈ సినిమాలో విక్రమ్‌, కార్తీక్‌ రత్నం, తేజ్‌, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతి ఒక్కరి పాత్రకు మంచి ప్రాధాన్యముంటుంది. కచ్చితంగా చెప్పాలంటే ‘హ్యాపీడేస్‌’ తరహాలో పాత్రలతో ముడిపడి సాగే కథ ఇది. ఇలాంటి కాలేజీ నేపథ్య చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ముఖ్యంగా అమ్మాయిలకు బాగా నచ్చేలా ఉంటుంది. ద్వితీయార్ధమంతా వాళ్లను హైలైట్‌ చేస్తూనే తీశాం. ప్రస్తుతం నేను కొన్ని కథలు సిద్ధం చేసుకున్నా. అది ఎవరితో ఉంటుందన్నది త్వరలో తెలియజేస్తా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.