హాలీవుడ్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల్లో 'స్పైడర్‌మ్యాన్' ఒకటి. ఇండియాలోనూ ఈ సూపర్‌హీరోకు భారీగానే అభిమానులున్నారు. ఈ సిరీస్ నుంచి వస్తోన్న తాజా చిత్రం 'స్పైడర్‌మ్యాన్: ఫ్యార్ ఫ్రమ్ హోమ్'. ఈ సినిమాను జులై 4న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
భారత్‌లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. ఇంతకుముందు జులై 5న విడుదల చేస్తామని ప్రకటించినా కొన్ని కారణాల వల్ల ఒకరోజు ముందుకు జరిపారు. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళంలోనూ ప్రేక్షకులముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 30 నుంచి ప్రారంభంకానున్నాయి.
ఈ చిత్రంలో స్పైడర్‌మ్యాన్ పాత్రను టామ్ హోలండ్ పోషిస్తుండగా.. జాన్ వాట్స్ దర్శకత్వం వహిస్తున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చూడండి.. మెటాలిక్ దుస్తుల్లో మెరిసిపోతున్న దీపికా పదుకునే