టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి.. చికిత్స కోసం మరోసారి అమెరికా వెళ్లారని ఊహాగానాలు జోరందకున్నాయి. అందుకోసం 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ చిత్రీకరణను మధ్యలోనే నిలిపేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ రూమర్లపై దగ్గుబాటి కుటుంబం స్పష్టతనివ్వాల్సి ఉంది.
గతంలోనూ అనారోగ్య సమస్యలతో రానా యూఎస్ వెళ్లారని పలు కథనాలు వచ్చాయి. అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా అందుకు దోహదపడ్డాయి.
ప్రస్తుతం.. రానా నటిస్తోన్న 'విరాటపర్వం' చిత్రీకరణ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్‌తో కలిసి 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్‌లో ఆయన నటిస్తున్నారు.
ఇదీ చూడండి: పవన్-రానా సినిమాలోని సన్నివేశం లీక్!