ETV Bharat / sitara

15 రకాల బిర్యానీలు ఒకేసారి తిన్నా: ప్రభాస్

డార్లింగ్ ప్రభాస్​ తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు ఆసక్తికర అంశాల్ని మనతో పంచుకున్నారు. ఇందులో తనకిష్టమైన సినిమాలు, నటీమణులు, ప్రదేశాల గురించి వెల్లడించారు.

special article about prabhas
ప్రభాస్
author img

By

Published : May 9, 2021, 3:04 PM IST

ప్రభాస్‌.. 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెబల్‌స్టార్‌ విభిన్నమైన పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌. డార్లింగ్‌ అంటూ సహచరులను ఆత్మీయంగా పిలిచే ప్రభాస్‌.. తన ఇష్టాయిష్టాల గురించి ఏం చెబుతున్నారంటే?

వాళ్ల నటన నచ్చుతుంది

నేను సినిమాల్లోకి రాకముందు నుంచీ జయసుధ, శ్రియ, త్రిషలకు అభిమానిని. ఆ తరువాత వాళ్లతోనే నటించే అవకాశం వచ్చిందనుకోండీ. హీరోల్లో అయితే షారుక్​ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాబర్ట్‌ డి నిరో అంటే చాలా ఇష్టం.

prabhas
ప్రభాస్

బలహీనత..

మొదటినుంచీ నాకు బద్ధకం ఎక్కువ. అదే నాకున్న అతి పెద్ద బలహీనత.

వాటితో సమయం తెలియదు

షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా.. తీరిక దొరికితే ప్రకృతి మధ్య గడిపేందుకు ప్రయత్నిస్తా. మా ఇంట్లో రకరకాల మొక్కలూ, చెట్లూ, పక్షులూ ఉంటాయి. వాటి మధ్య తిరుగుతుంటే నాకు ప్రపంచమే తెలియదు.

ఇరవైసార్లు చూసి ఉంటా..

నాకు ‘త్రీ ఇడియట్స్‌’, ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాలంటే ఎంత ఇష్టమంటే... వాటిని ఇప్పటివరకూ కనీసం ఓ ఇరవైసార్లు చూసి ఉంటా. అవి చూశాక అవకాశం వస్తే వాటిని తీసిన రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వంలో నటించాలని అనిపించింది. చూడాలి ఆ అవకాశం వస్తుందో రాదో...

prabhas
ప్రభాస్

నా లక్ష్యం వేరే..

మాది సినిమా నేపథ్యమే అయినా నేను అనుకోకుండానే ఇటువైపు వచ్చా. నాకు చిన్నప్పటినుంచీ హోటల్‌ రంగంలోకి వెళ్లాలని ఉండేది.

అదో మంచి జ్ఞాపకం

‘బాహుబలి’ చేస్తున్నప్పుడు కాస్త బరువు పెరగాల్సి వచ్చింది. దాంతో రోజూ నలభైకి పైగా గుడ్లు తినేవాడిని. ఒకవేళ ఎప్పుడైనా డైటింగ్‌ నుంచి బ్రేక్‌ దొరికితే.. నాకెంతో ఇష్టమైన బిర్యానీని కనీసం పదిహేను రకాల్లో తెప్పించుకుని లాగించేవాడిని. ఇక, కండలు పెంచుకునేందుకు వ్యాయామం కూడా ఎక్కువగా చేయాల్సి వచ్చేది. తరచూ జిమ్‌కు వెళ్లలేను కాబట్టి ఇంట్లోనే ఒకటిన్నర కోట్ల రూపాయలతో ఓ జిమ్‌ను ఏర్పాటు చేసుకుని ఖాళీ దొరికినప్పుడల్లా వ్యాయామం చేసేవాడిని. అయితే.. షూటింగ్‌ పూర్తయ్యాక కొన్నాళ్లు అసలు గుడ్ల జోలికే వెళ్లలేదు. ఆ సినిమా హిట్టు కావడం వల్ల నా శ్రమవృథా కాలేదని అనిపించింది.

prabhas bahubali
బాహుబలి సినిమాలో ప్రభాస్

తీరిక దొరికితే..

చాలా తక్కువమంది స్నేహితులతో గడుపుతుంటా.. అదీ నాకు బాగా తెలిసినవాళ్లతోనే. పుస్తకాలు ఎక్కువగా చదువుతా. లేదంటే ఫ్రెండ్స్‌ను ఇంటికి పిలిచి.. వాళ్లతో కాసేపు వాలీబాల్‌ ఆడేస్తా. దానివల్ల చాలా హాయిగా అనిపిస్తుంది. లేదంటే రాక్‌ క్లైంబింగ్‌ చేస్తా. జిమ్‌లో వర్కవుట్లు చేయడం కన్నా రాక్‌ క్లైంబింగ్‌తోనే ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి మరి.

ఇష్టమైన ప్రదేశం

నాకు లండన్‌, ప్యారిస్‌, దుబాయ్‌ వంటి ప్రదేశాలంటే చాలా ఇష్టం. నాల్రోజులు సరదాగా ఎక్కడికైనా వెళ్లినా- మొత్తం మీద ఇంటిని మించిన చోటు మరొకటి ఉండదనేది నా అభిప్రాయం.

అందుకే షూటింగ్‌లో భాగంగా ఏ ప్రాంతంలో ఉన్నా.. వీలైనంత త్వరగా ఇంటికి వచ్చేయాలనుకుంటా. అలాగే చిన్నతనంలో నాన్న, బాబాయ్‌ ఏదైనా సినిమా విడుదలకు ముందు శ్రీశైలానికి వెళ్తూ మమ్మల్ని తీసుకెళ్లేవారు. ఇప్పటికీ నేను కూడా కుదిరినప్పుడల్లా శ్రీశైలం వెళ్తుంటా.

prabhas
కొత్త కారుతో ప్రభాస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.