కొన్ని కథలు భాషతో సంబంధం లేకుండా ఆకట్టుకుంటుంటాయి. అలాంటి ఓ అంతర్జాతీయ కథ.. ఇప్పుడు మన భారతీయ దర్శకుల్ని ఆకట్టుకుంది. అందుకే వరసగా వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అదే స్పానిష్ చిత్రం 'జులియాస్ ఐస్'. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఐదు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఇటీవల తాప్సీ ప్రధాన పాత్రలో ఆమె నిర్మాతగా 'బ్లర్' చిత్రాన్ని ప్రకటించింది. ఇది 'జులియాస్ ఐస్'కు హిందీ రీమేక్. రితేష్ దేశముఖ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న మరాఠా సినిమా 'అదృశ్య'. ఇదీ స్పానిష్ చిత్రానికి రీమేకే. ఇందులో మంజరీ ఫడ్నవీస్ కీలక పాత్రలో నటిస్తోంది. కబీర్‌లాల్ ఈ చిత్రానికి దర్శకుడు.
మరాఠీతో పాటు బెంగాలీ, తమిళ, తెలుగు భాషలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. బెంగాలీలో 'అంతర్దృష్టి' పేరుతో రీతూ పర్ణాసేన్ గుప్తా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తమిళంలో 'ఉన్ పారవాయి', తెలుగులో 'అగోచర'గా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తన సోదరి అనుమానాస్పద మృతి వెనుకున్న రహస్యాన్ని చేధించే క్రమంలో నెమ్మదిగా తన చూపును కోల్పోయే ఓ మహిళ కథే 'జూలియస్ ఐస్'.
ఇవీ చదవండి: