ETV Bharat / sitara

సోనూసూద్ ట్రస్ట్.. కరోనా బాధితుల పాలిట సంజీవిని

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ చేసిన ఓ మంచి పని పది మంది ప్రాణాలను కాపాడింది. ఆక్సిజన్​ దొరక్క చావుతో పోరాడుతున్న కొవిడ్​ బాధితులకు సరైన సమయంలో ప్రాణవాయువును అందించి వారి ప్రాణాలను రక్షించారు ఆయన స్థాపించిన చారిటబుల్​ ట్రస్ట్ సభ్యులు.

sonu
సోనూ
author img

By

Published : May 4, 2021, 6:13 PM IST

Updated : May 4, 2021, 6:36 PM IST

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​ చేసిన ఓ మంచి కార్యక్రమం వల్ల పది మందికి పైగా ప్రాణాలు దక్కాయి. ఆయన స్థాపించిన సోనూసూద్​ చారిటబుల్​ ట్రస్ట్.. కరోనా బాధితుల పట్ల సంజీవినిగా మారింది. ఆక్సిజన్​ దొరక్క చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పది మంది వైరస్​ రోగులకు సరైనా సమయంలో ఆక్సిజన్​ను అందించి వారి ప్రాణాలను కాపాడింది.

​ఇదీ జరిగింది

కర్ణాటక యెలాహంక దగ్గర్లోని ఆర్కా ప్రైవేట్​ ఆస్పత్రిలో పదిమందికి పైగా కరోనా బాధితులు చికిత్స కోసం చేరారు. అయితే చేరిన ఒక్క రాత్రిలోనే ఆక్సిజన్ అందుబాటులో లేక ఇద్దరు బాధితులు కన్నుమూశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. అత్యవసరంగా ప్రాణవాయువు కోసం యెలహంక న్యూటౌన్​ పోలీస్​స్టేషన్​ను సంప్రదించింది. తక్షణమే స్పందించిన అక్కడి ఇన్​స్పెక్టర్ సత్యనారాయణ్​, సోనూసూద్​ చారిటబుల్​ ట్రస్ట్​ను సంప్రదించారు. వెంటనే స్పందించిన ట్రస్ట్​ సభ్యులు 11 ఆక్సిజన్​ సిలిండర్లను బైక్స్​, కార్లు ద్వారా ఆస్పత్రికి తరలించి.. రోగులకు ప్రాణవాయువును సకాలంలో అందించారు. దీంతో పది మందికిపైగా కొవిడ్​ బాధితులు చావు నుంచి తప్పించుకున్నారు.

ఇదీ చూడండి: '100 కోట్ల సినిమా కంటే ప్రజాసేవే ముఖ్యం'

Last Updated : May 4, 2021, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.