ETV Bharat / sitara

'వీలైతే సాయం చేయండి.. కామెంట్లు కాదు'

ప్రముఖ నటుడు సోనూసూద్​ చేస్తున్న సేవను కొందరు మెచ్చుకుంటుంటే మరికొంత మంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఈ కామెంట్లపై సోను స్పందించారు. వీలైతే సాయం చేయండి కానీ ఇలా విమర్శించొద్దని సూచించారు.

Sonu-Sood-shares-proof-as-netizen-accuses-him-of-offering-help-to-fake-accounts
ఓ నెటిజెన్​ ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సోనూ
author img

By

Published : Oct 27, 2020, 9:53 AM IST

Updated : Oct 27, 2020, 11:43 AM IST

నటుడు సోనూసూద్​ చేస్తున్న సాయాన్ని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ప్రచారం కోసం సోను ఫేక్​ అకౌంట్లకు రిప్లై ఇస్తున్నారని విమర్శించారు. దీనిపై సోను సరైన సమాధానం ఇచ్చారు. ఆస్పత్రి రిసిప్ట్స్ కూడా షేర్​ చేశారు.

ఇదే జరిగింది :

"వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి శస్త్ర చికిత్సకు సాయం చేయండి" అంటూ స్నేహల్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌ వేదికగా సోనును కోరారు. దీనికి ఆయన స్పందిస్తూ సాయం అందుతుందని ప్రామిస్‌ చేశారు. అయితే దీన్ని ఓ నెటిజన్‌ తప్పుపట్టాడు. ప్రచారం కోసం సోను ఫేక్‌ అకౌంట్లకు రిప్లై ఇస్తున్నారంటూ విమర్శించాడు.

Sonu-Sood-shares-proof-as-netizen-accuses-him-of-offering-help-to-fake-accounts
ఓ నెటిజెన్​ ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చిన సోనూ

"స్నేహల్‌ కొత్తగా ట్విట్టర్‌ ఖాతా ఆరంభించాడు. అతడ్ని కేవలం ముగ్గురు మాత్రమే ఫాలో అవుతున్నారు. కేవలం ఒకేఒక్క ట్వీట్‌ చేశాడు. స్వస్థలం, వివరాలు, ఈమెయిల్‌ అడ్రస్‌ కూడా లేవు. కానీ అతడి ట్వీట్‌ను సోనూ చూసి స్పందించారు. గతంలో ఆయన సాయం చేస్తానని రిప్లై ఇచ్చిన ట్విట్టర్‌ ఖాతాలు కూడా ఇలాంటివే. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను చాలా మంది డిలిట్‌ చేశారు. పబ్లిక్‌ రిలేషన్స్‌ టీం ఇలా పనిచేస్తోంది" అని సోను సాయంపై నెటిజన్ విమర్శలు చేశాడు.

ఆసుపత్రి రిసిప్ట్స్​ను షేర్​ చేసిన సోనూసూద్​

"అవసరాల్లో ఉన్న వారిని నేను గుర్తించా. నా రూపంలో వారికి సాయం అందుతోంది. ఇదంతా మన ఆలోచనల్ని బట్టి ఉంటుంది. నీకు అర్థం కాదు. రోగి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. అతడికి కొన్ని పండ్లు పంపించు. కోట్ల మంది ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తి ప్రేమగా వ్యవహరిస్తే ముగ్గురు ఫాలోవర్స్‌ ఉన్న వ్యక్తి ఎంతో సంతోషంగా ఫీల్‌ అవుతాడు" అంటూ ఆ నెటిజన్ ట్వీట్​కు బదులిచ్చారు సోను.

Last Updated : Oct 27, 2020, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.