లాక్‌డౌన్‌తో పలుచోట్ల చిక్కుకుపోయిన వలసకూలీలను వారి స్వస్థలాలకు చేర్చిన సోనూసూద్.. ప్రజల మనసులు గెల్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా చేస్తున్నారని కొందరు నేతలు అన్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సోనూ.. ఈ వ్యాఖ్యలపై తాను చింతించట్లేదని చెప్పారు. వాటి గురించి అసలు ఆలోచించట్లేదని తెలిపారు.
"నాపై ఆరోపణల్ని నేను పట్టించుకోను. ఎందుకంటే అలాంటి వాటిపై స్పందించే సమయంలో కూలీలకు సాయం చేసుకోవచ్చు. నాకు మాట్లాడటం కంటే చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు మంచి చేయాలని చూసినా, భిన్నంగా ప్రయత్నించినా అందరి వేళ్లు మీవైపే ఉంటాయి. ఒకవేళ ఆరోపణలు చేసినా, అవి నాకు ఎక్కువ పనిచేసేలా బలాన్నిస్తాయి. ఇంకా ఇంకా చేసేలా ప్రోత్సహిస్తాయి" -సోనూసూద్, నటుడు
కూలీలనే కాకుండా డబ్బుల్లేక ముంబయిలో చిక్కుకుపోయిన సహనటుడు సురేంద్ర రాజన్‌కు సాయం చేశారు సోనూసూద్.
ఇవీ చదవండి:
- సోనూసూద్‌కు అక్కడి నుంచి 11వేల ఉత్తరాలు
- సోనూసూద్‌కు ఆ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు
- సోనూసూద్: రీల్ విలన్ టు రియల్ హీరో
- సోనూసూద్‌పై అభిమాని అద్భుత స్కెచ్
- సోనూసూద్ దాతృత్వం.. కూలీల కోసం ఏకంగా విమానం
- 'సోనూసూద్ లాంటి వ్యక్తులు చాలా అరుదు'
- వలస కూలీలను హెచ్చరించిన సోనూసూద్
- 'భాజపా చేతిలో సోనూసూద్ కీలుబొమ్మ'
- పాత జ్ఞాపకం చూసి సోనూసూద్ భావోద్వేగం
- 'ఆఖరి కూలీ ఇంటికి చేరే వరకు కొనసాగిస్తా'