అతిలోక సుందరి శ్రీదేవి కూతురు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ వేసుకునే దుస్తుల విషయమై తాను చింతిస్తున్నానంటూ తెలిపింది కత్రినా కైఫ్. వీరిద్దరూ బాంద్రాలోని ఒకే జిమ్‌లో వర్కవుట్లు చేస్తుంటారు. అక్కడికి చిట్టిపొట్టి షార్ట్స్ వేసుకొని వెళ్తుంటుంది జాన్వీ. ఈ ఫొటోలు ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల ఓ ముఖాముఖిలో ఈ విషయంపై మాట్లాడింది కత్రినా.
‘‘జాన్వీ జిమ్‌కు మరీ చిన్నగా కనిపించే షార్ట్స్ వేసుకొస్తూ ఉంటుంది. ఆ విషయంలో నేను కాస్త భయపడుతుంటాను. ఇద్దరం ఒకే జిమ్‌కి వెళతాం. కలిసే వర్కవుట్లు చేస్తుంటాం. కానీ తన దుస్తుల విషయంలో మాత్రం కాస్త చింతిస్తుంటాను’’ -కత్రినా కైఫ్, బాలీవుడ్ హీరోయిన్
అనంతరం సోనమ్ కపూర్ ఈ విషయంపై స్పందించింది. సోదరి జాన్వీని సమర్ధిస్తూ షార్ట్స్‌లో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పరోక్షంగా కత్రినా కైఫ్‌కు సమాధానమిచ్చింది.
‘‘జాన్వీ సాధారణ దుస్తులూ వేసుకుంటుంది. వాటిలో ఆమె మరింత అందంగా కనిపిస్తుంటుంది’’ -సోనమ్ కపూర్, హీరోయిన్
అనంతరం వీరిద్దరి వ్యాఖ్యలపై మీడియాలో వివిధ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ దుమారంపై ట్విట్టర్ వేదికగా కత్రినాతో తనుకున్న అనుబంధాన్ని వెల్లడించింది సోనమ్.
"నా స్నేహితురాలు కత్రినా.. చేసిన వ్యాఖ్యలకు దీటుగా జాన్వీని సమర్థించాలని నేను ప్రయత్నించలేదు. కత్రినా మామూలుగానే ఆ వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని మీడియా పెద్దది చేయొద్దు" -సోనమ్ కపూర్, బాలీవుడ్ కథానాయిక
ఇది చదవండి: 'రౌడీ బేబీ'... యూట్యూబ్‌లో 'రికార్డ్ బేబీ'... 500 మిలియన్ల వీక్షణలు అందుకున్న పాట