ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం 'టెనెట్'. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఒకరు. ఇటీవలే లండన్‌లో సినిమా విడుదల కాగా.. సోనమ్ థియేటర్‌కి వెళ్లి తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఇందులో ప్రముఖ సీనియర్ నటి డింపుల్ కపాడియా కూాడా నటించారు. ఈ నేపథ్యంలో సోనమ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా సినిమాపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం తన భర్త ఆనంద్ అహుజాతో కలిసి లండన్‌లోనే ఉంటోంది సోనమ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఈ రోజు నేను 'టెనెట్' చిత్రాన్ని చూసేందుకు థియేటర్ వెళ్లా. బిగ్ స్క్రీన్‌పై సినిమా చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. సినిమాలో డింపుల్ కపాడియా నటన చూసి రోమాలు నిక్కపొడుచుకున్నాయి. 'టెనెట్' మూవీతో మరో చిత్రాన్ని పోల్చలేం."
-సోనమ్ కపూర్, సినీ నటి
సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం ఆగస్టు 26న విడుదలైంది. అయితే, అమెరికాలో మాత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబర్ట్ ప్యాటిన్సన్, జాన్ డేవిడ్ వాషింగ్టన్, డింపుల్ కపాడియా, కెన్నెత్ బ్రానాగ్ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషించారు.