గత డిసెంబరులో 'ప్రతిరోజూ పండగే' అంటూ కుటుంబంతో కలిసొచ్చిన మెగాహీరో సాయితేజ్.. ఈ సారి ఒంటరిగా వస్తున్నాడు. 'సోలో బ్రతుకే సో బెటర్' అంటూ సింగిల్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను ట్విట్టర్లో పంచుకున్నాడు. "సోలో సోదర సోదరీమణులారా...ఈ వాలంటైన్స్ వీకెండ్ మనం అంతా కలిసి జరుపుకుందాం... మన స్లోగన్ ఒకటే... సోలో బ్రతుకే సో బెటర్ 💪🏼" అంటూ రాసుకొచ్చాడు.
ఇందులో నభా నటేశ్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నాడు. సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మే 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.