'వాలి', 'ఖుషి' లాంటి హిట్ చిత్రాలను తెరకెక్కించి అనంతరం నటుడిగా అవతారమెత్తి అందులోనూ మెప్పిస్తున్నాడు ఎస్జే సూర్య. అయితే ఈ దర్శకనటుడిపై కోలీవుడ్‌లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇతడు నటి ప్రియాభవానీ శంకర్‌కు లవ్ ప్రపోజ్ చేసినట్లు, అందుకు ఆమె తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై ఎస్జే సూర్య స్పందించాడు.
-
Some idiot have spread the wrong news that I made a love Propossal to @priya_Bshankar and she rejected it .... she a very good friend of mine since “Monster” & sincere actress too that’s it .... pls don’t irritate and spread false baseless rumours ... thx ... sjs
— S J Suryah (@iam_SJSuryah) January 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Some idiot have spread the wrong news that I made a love Propossal to @priya_Bshankar and she rejected it .... she a very good friend of mine since “Monster” & sincere actress too that’s it .... pls don’t irritate and spread false baseless rumours ... thx ... sjs
— S J Suryah (@iam_SJSuryah) January 15, 2020Some idiot have spread the wrong news that I made a love Propossal to @priya_Bshankar and she rejected it .... she a very good friend of mine since “Monster” & sincere actress too that’s it .... pls don’t irritate and spread false baseless rumours ... thx ... sjs
— S J Suryah (@iam_SJSuryah) January 15, 2020
"కొందరు పనిలేనివాళ్లు పనిగట్టుకొని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ప్రియాభవానీ శంకర్‌కు లవ్ ప్రపోజ్ చేశానని, ఆమె తిరస్కరించిందని అసత్యాన్ని వ్యాప్తి చేస్తున్నారు. 'మాన్స్టర్' చిత్రం నుంచి ఆమె నాకు మంచి స్నేహితురాలు. అలాగే మంచి నటి కూడా. దయచేసి నన్ను విసిగించకండి, ఆధారాల్లేని, అసత్యవార్తలను వ్యాప్తి చేయొద్దు"
- ఎస్జే సూర్య ట్వీట్.
ప్రస్తుతం ఎస్జే సూర్య నటుడిగా బిజీగా ఉన్నాడు. 'నెనజమ్ మరప్పతిల్లాయ్', 'ఇరివాకలమ్' తదితర చిత్రాల్లో నటిస్తున్నాడు. మహేశ్ హీరోగా రూపొందిన 'స్పైడర్' సినిమాలో సైకోగా కనిపించి తన నటనతో విమర్శకులను మెప్పించాడు ఎస్జే సూర్య.
ఇదీ చదవండి: 'లుంగీని మహేశ్ ఇంకొంచెం పైకి లేపుతాడా అని చూశారు'