ETV Bharat / sitara

ఆర్​సీ-15 సినిమాలో సైకో విలన్​గా కోలీవుడ్​ స్టార్​! - ఎస్​ జే సూర్య

Ramcharan Shankar movie: రామ్​చరణ-శంకర్​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలో తమిళ స్టార్​ ఎస్​ జే సూర్య నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

SJ Surya in Ramcharan shankar movie
రామ్​చరణ్​ ఎస్ జే సూర్య
author img

By

Published : Feb 14, 2022, 10:25 PM IST

Ramcharan Shankar movie: శంకర్​ దర్శకత్వంలో రామ్​చరణ్​ కథానాయకుడిగా 'ఆర్​సీ 15' తెరెకక్కుతోంది. అయితే ఈ మూవీలో తమిళ స్టార్​ డైరెక్టర్​, నటుడు ఎస్​ జే సూర్యను ప్రతినాయకుడిగా తీసుకోనున్నారని తెలుస్తోంది. సైకో విలన్​గా ఆయన కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట! త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

ఎస్​ జే సూర్య.. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్​గా నటించారు. మహేశ్​బాబు 'స్పైడర్'​, విజయ్​ 'అదిరింది' సహా పలు మూవీస్​లో ప్రతినాయకుడిగా కనిపించారు. ఇటీవలే 'మానాడు' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

sj surya
ఎస్​ జే సూర్య

కాగా, 'ఆర్​సీ 15'లో చరణ్​ రెండు విభిన్న గెటప్​లలో కనిపించనున్నారని తెలిసింది. ఉన్నతాధికారిగా ఒక గెటప్‌లో సీరియస్‌గా కనిపిస్తూనే సాధారణ వ్యక్తిగా మరో గెటప్‌లో అలరించనున్నారట.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్​ రాజమండ్రిలో జరుపుకుంటోంది. ఇక ఈ మూవీలో కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తోంది. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సెట్స్‌పైన ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది.

ఇదీ చూడండి: EEsha Gupta gallery: ఈషా గుప్తా హాట్​ స్టిల్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.