Sivakarthikeyan anudeep movie: 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్ కొత్త సినిమా మొదలైంది. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కారైకుడిలో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కథానాయకుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూకే నేపథ్య కథతో తీస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
Kangana ranaut news: కంగనా రనౌత్ తొలిసారి చేస్తున్న రియాలిటీ షో 'లాక్ అప్'. దీని ఫస్ట్‌లుక్ గురువారం రిలీజైంది. గోల్డెన్ డ్రస్‌లో ఉన్న కంగన.. షోపై అంచనాలు పెంచుతోంది. శుక్రవారం టీజర్‌ను విడుదల చేయనున్నారు. అలానే ఫిబ్రవరి 27 నుంచి ఈ షో.. ALT బాలాజీ& MX ప్లేయర్లలో ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు.

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన కొత్త సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా నాన్- థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.25 కోట్లకు అమ్ముడుపోయాయి. శర్వానంద్ కెరీర్లో ఇదే అత్యధిక మొత్తం కావడం విశేషం.

ఈ సినిమాలో శర్వానంద్ సరసన రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. రాధిక, ఊర్మిళ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతమందించారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు.
ఇవీ చదవండి: