ETV Bharat / sitara

టాలీవుడ్​లో మరో నటుడికి త్వరలో పెళ్లి - రానా మిహిక పెళ్లి

పలు చిత్రాల్లో సహాయ నటుడిగా మెప్పించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా నిశ్చితార్థం జరిగింది. ఇటీవల కాలంలో టాలీవుడ్​లో వరుసగా వివాహాలు జరుగుతుండటం విశేషం.

టాలీవుడ్​లో మరో నటుడికి త్వరలో పెళ్లి బాజా
నటుడు రాజా నిశ్చితార్థం
author img

By

Published : Aug 16, 2020, 3:57 PM IST

'ఇది లాక్​డౌన్​లా లేదు.. టాలీవుడ్​లో పెళ్లిళ్ల సీజన్​లా ఉంది' అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా జోక్​లు పేలుతున్నాయి. ఎందుకంటే ఇటీవలే కొన్ని నెలలుగా పలువురు తెలుగు సినీ ప్రముఖుల వివాహాలు జరుగుతుండటమే కారణం. ఈ క్రమంలోనే ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు, నటుడు రాజా నిశ్చితార్థం.. ఆదివారం(ఆగస్టు 16)ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని రాజా తన ఇన్​స్టాలో పంచుకున్నాడు. జీవితంలోని కొత్త ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రాసుకొచ్చాడు.

actor Raja Chembolu gets engaged
నటుడు రాజా నిశ్చితార్థం

ఇటీవలే మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జరగ్గా, అంతకు ముందు రానా-మిహీక.. నిఖిల్-పల్లవి.. నితిన్-షాలినిల వివాహాలు జరిగాయి. నిర్మాత దిల్​రాజు కూడా మూడు నెలల క్రితం.. ఇదే లాక్​డౌన్​లో పెళ్లి చేసుకున్నారు.

ఫిదా, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మిస్టర్ మజ్ను, హ్యాపీ వెడ్డింగ్, అంతరిక్షం, రణరంగం సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించాడు రాజా. పలు చిత్రాల్లో నటిస్తూనే వెబ్​ సిరీస్​ల్లోనూ కీలకపాత్రలు చేస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.