ETV Bharat / sitara

సింగర్ సిద్ శ్రీరామ్​కు అవమానం - సింగర్ సిద్ శ్రీరామ్​కు అవమానం

గాయకుడు సిద్ శ్రీరామ్​కు హైదరాబాద్​లోని ఓ పబ్​లో చేదు అనుభవం ఎదురైంది. తన బ్యాండ్​తో స్టేజిపై పాటలు పాడుతుండగా కొందరు ఆకతాయిలు.. వారిపై మద్యంతో పాటు నీళ్లు చల్లారు.

Singer Sid Sriram insulted in Pub
సింగర్ సిద్ శ్రీరామ్​కు అవమానం
author img

By

Published : Mar 9, 2021, 9:45 AM IST

గాయకుడు సిద్‌ శ్రీరామ్‌కు హైదరాబాద్‌లో అవమానం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆయన జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని సన్‌బర్న్‌ పబ్‌లో నిర్వహించిన వేడుకకు హాజరయ్యారు. కార్యక్రమానికి సిద్‌ శ్రీరాం వస్తుండటం వల్ల నిర్వాహకులు టిక్కెట్లు అడ్డగోలుగా అమ్మేశారు. కేవలం 500 మంది లోపు సరిపోయే ఈ ప్రాంగణంలో వందలాది మంది వచ్చారు.

సిద్‌ శ్రీరాం ఒకవైపు తన బ్యాండ్‌తో కలిసి పాటలు పాడుతుండగా పై నుంచి కొందరు ఆకతాయిలు మద్యంతో పాటు నీళ్లు చల్లారు. ఆయా బృంద సభ్యులపై అవి పడటం వల్ల కార్యక్రమం మధ్యలోనే నిలిపారు. ఇలాంటి వాటికి తగ్గేది లేదంటూ పాటలను కొనసాగించారు. అనంతరం తన ట్విట్టర్‌ ఖాతాలో స్పందిస్తూ.. "మనసును అదుపులో పెట్టుకుంటే పనిచేసే ప్రాంతంలో భయం ఉండదు" అంటూ ట్వీట్ చేశాడు.

అయితే ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని జూబ్లీహిల్స్‌ పోలీసులు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ పోలీసు అధికారుల పాత్రపై పలు ఆరోపణలు వస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.