ETV Bharat / sitara

Manikka Vinayagam: 'శంకర్‌ దాదా' సింగర్‌ కన్నుమూత - శంకర్‌దాదా

Manikka Vinayagam: ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు.

Manikka Vinayagam
మాణిక్య వినాయగం
author img

By

Published : Dec 27, 2021, 7:49 AM IST

Updated : Dec 27, 2021, 8:11 AM IST

Manikka Vinayagam: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయకుడు, నటుడు మాణిక్య వినాయగం (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించడం వల్ల ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1943 డిసెంబరు 10న జన్మించిన మాణిక్య వినాయగం.. తన మామయ్య, గాయకుడు సీఎస్‌ జయరామన్‌ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. 'దిల్‌' (2001) అనే తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమలో గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. అన్ని భాషల్లో కలిపి 800లకిపైగా పాటల్ని పాడారు. వేల సంఖ్యలో ఆధ్యాత్మిక, జానపదాల్ని ఆలపించారు.

వినాయగం పాడిన ప్రతి పాటా సంగీత అభిమానుల్ని ఉర్రూతలూగించింది. చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌' చిత్రంలోని 'పట్టుపట్టు చేయ్యే పట్టు'తో టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించారు. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ తనదైన ముద్రవేశారు. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని మెప్పించారు. మాణిక్య మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం ప్రకటించారు.

ఇదీ చూడండి: KV Raju: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత

Last Updated : Dec 27, 2021, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.