తన పుట్టిన రోజున అభిమానులెవరూ దయచేసి తన ఇంటికి రావొద్దని నటుడు శింబు కోరారు. ఎంతోమంది ప్రేమాభిమానాల వల్లే తాను ఈ స్థాయికి వచ్చానని చెప్పిన ఆయన.. తాజాగా ట్విటర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. మరో నాలుగు రోజుల్లో శింబు.. 38వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.
"జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు, ఎత్తుపల్లాలను చూశాను. కానీ మీ ప్రేమాభిమానాలు మాత్రం ప్రతి క్షణం నాతోనే ఉన్నాయి. శారీరకంగా నేను ఫిట్‌గా మారడానికి, వరుస సినిమాలు ఓకే చేయడానికి మీ అభిమానమే కారణం. నేను నటించిన 'ఈశ్వరన్' సినిమాపై మీరు చూపించిన ప్రేమకు ఎంతలా కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. నేను మిమ్మల్ని అభిమానుల్లా కాదు నా కుటుంబంలా భావిస్తున్నాను. ఫిబ్రవరి 3న నా పుట్టినరోజును మీతో జరుపుకోవాలని అనుకున్నాను. కానీ ఎప్పటి నుంచో ఓ చోటుకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాను. అలా ఈ పుట్టినరోజుకు అక్కడికి వెళ్తున్నాను. ఆరోజు నేను నగరంలో ఉండడం లేదు. కాబట్టి ఎవరూ మా ఇంటికి రావొద్దు" అని శింబు ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: మాస్ మహారాజ్ చిత్రంలో యాక్షన్ కింగ్