కరోనా నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు రద్దయ్యాయి. ఫలితంగా నటీనటులంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. తాజాగా ఓ వంట వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. మొదటిసారి వంట చేస్తున్నట్టు అందులో తెలిపాడు.
"కొత్తగా ఏదైనా చేయడానికి వెనుకాడకూడదు. నా మొదటి ప్రయత్నంగా బటర్ గార్లిక్ రొయ్యల కూర తయారు చేశాను. తొలిసారి వండినా అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఇంకా ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను."
- సిద్ధార్థ్ మల్హోత్రా, బాలీవుడ్ హీరో
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సిద్ధార్థ్.. ఇటీవల 'మర్జావాన్' సినిమాతో తెరపై కనువిందు చేశాడు. ప్రస్తుతం పరమవీర చక్ర అవార్డు విజేత, ఆర్మీ కెప్టెన్ విక్రమ్ భాత్రా జీవితాధారంగా తెరకెక్కుతోన్న 'షెర్షా' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ద్విపాత్రాభియం చేయనున్నాడు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ ఈ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదీ చూడండి.. 'అబద్ధం' చెప్పారని పవన్, రజనీ ట్వీట్స్ డిలీట్