ETV Bharat / sitara

Siddharth on ticket price: 'సినీ పరిశ్రమను వేధించడం ఆపండి' - actor siddharth twitter

Siddharth on ticket price: సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ నటుడు సిద్ధార్థ్. సినీ పరిశ్రమనే ఎందుకు టార్గెట్​ చేస్తున్నారని ప్రశ్నించారు. పరిశ్రమను వేధించడం ఇకనైనా ఆపండి అని వ్యాఖ్యానించారు.

Siddharth
'సినీ పరిశ్రమను వేధించడం ఆపండి'
author img

By

Published : Dec 3, 2021, 3:46 PM IST

Siddharth on ticket price: సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంపై నటుడు సిద్ధార్థ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి ఎంతోమంది జీవనం సాగిస్తున్నారని.. అలాంటి పరిశ్రమనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియా వేదికగా #SaveCinema అంటూ వరుస ట్వీట్లు పెట్టారు.

"25 సంవత్సరాల క్రితం మొదటిసారి విదేశాల్లో సినిమా చూశాను. నా స్టూడెంట్‌ ఐడీ కార్డు ఉపయోగించి అప్పట్లోనే ఎనిమిది డాలర్లు అంటే రూ.200 చెల్లించి ఆ సినిమా చూశా. ఇప్పుడు మనం నిర్మిస్తున్న చిత్రాలు టెక్నాలజీ, టాలెంట్‌లో మిగతా దేశాల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటున్నాయి. సినిమా టికెట్లు, పార్కింగ్‌ రేట్లపై ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు ఎలాంటి హక్కు లేదు. సినిమా కంటే మద్యం, పొగాకుకు మీరు ఎక్కువ గౌరవమిస్తున్నారు. ఇప్పటికైనా ఈ దురాచారాన్ని ఆపండి. ఎన్నో వేల మంది ప్రజలు పరిశ్రమనే నమ్ముకుని బతుకుతున్నారు. మా వ్యాపారాన్ని ఎలా చేసుకోవాలో మీరు మాకు చెప్పకండి. పన్నులు, సెన్సార్‌ విషయంలో మీరు ఏం చెప్పినా వింటాం. కానీ, నిర్మాతలు, వాళ్ల ఉద్యోగులకు జీవనోపాధి లేకుండా చేయకండి."

-సిద్ధార్థ్​, సినీ నటుడు

ఆదాయం కావాలనుకుంటే ప్రతి పరిశ్రమలోనూ ఎంతో మంది సంపన్నులున్నారు.. వాళ్ల నుంచి కూడా తీసుకోండన్నారు సిద్ధార్థ్​. సినిమా పరిశ్రమ ఒక్కదాన్నే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. సినిమా బడ్జెట్‌ అనేది కొనుగోలుదారుడిపై ఆధారపడదని.. దర్శక, నిర్మాతలపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. సినిమా ద్వారా ఎవరు ఎంత సంపాదిస్తారో నిర్ణయించే హక్కు ఏ ఒక్కరికీ లేదన్న సిద్ధార్థ్.. పేదరికం నుంచి వచ్చి ధనికులుగా రాణిస్తున్న రాజకీయ నాయకులను ప్రశ్నించగలరా? అంటూ విమర్శించారు.

'పరిశ్రమను వేధించడం ఇకనైనా ఆపండి. మనకు తిండి పెడుతున్న రైతులు ఎంత గొప్పవాళ్లో మనందరికీ తెలుసు.. ఇప్పటికే వాళ్ల కోసం మేము పోరాటం చేశాం. మేము రైతులంత గొప్పవాళ్లం కాకపోవచ్చు. కానీ మేము కూడా మనుషులం, పన్ను చెల్లింపుదారులం' అని సిద్ధార్థ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : యూట్యూబ్​లో ఈ ఏడాది ఎక్కువమంది చూసిన వీడియో ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.