ETV Bharat / sitara

సుశాంత్ ఆఖరి సందేశం అదేనా? - సుశాంత్‌ పంపిన ఆఖరి మెసేజ్‌ అదే..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్యపై అతడి స్నేహితుడు సిద్దార్థ్ గుప్తా తాజాగా స్పందించాడు. సుశాంత్ మృతికి ఐదురోజుల ముందు ఒకసారి కలుద్దామని సంక్షిప్త సందేశాలు పంపించుకున్నామన్నాడు.

Siddharth Gupta opens up on the last text from the late actor Sushant Singh Rajput
సుశాంత్ ఆఖరి సందేశం అదేనా?
author img

By

Published : Dec 1, 2020, 2:04 PM IST

బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి ఐదు నెలలు దాటింది. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆ చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు మాట్లాడకుండా ఉన్న సుశాంత్‌ మిత్రుడు సిద్ధార్థ్‌ తాజాగా స్పందించాడు. సుశాంత్‌ మృతికి ఐదు రోజుల ముందు ఒకసారి కలుద్దామని సంక్షిప్త సందేశాలు పంపించుకున్నామన్నాడు.

Siddharth Gupta opens up on the last text from the late actor Sushant Singh Rajput
సిద్దార్థ్ గుప్తా

"మనమింకా పరిపూర్ణత సాధించాలని సుశాంత్‌ అంటుండేవాడు. ప్రతి రోజూ కొత్తదనం కోరుకునేవాడు. ఏదో సాధించాలని చెబుతుండేవాడు. అతని వల్లే నేను కూడా కొత్తగా ఆలోచించడం, కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవడం నేర్చుకున్నా. తన చుట్టుపక్కల వాళ్లను ఎంతో ప్రేమిస్తాడు. ఒక స్నేహితుడిగా నాకు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు. అతనికి సహచరుడిగా ఉండటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా."

-సిద్దార్థ్, సుశాంత్ స్నేహితుడు

ఇక వాళ్ల మధ్య జరిగిన ఆఖరి సంభాషణ గురించి మాట్లాడుతూ.. "నిన్ను, కుశల్‌ ఝవేరీ(సుశాంత్‌ మరో స్నేహితుడు) ఇద్దర్నీ కలవాలని అనిపిస్తోంది. మనం కలిసి తిరిగిన పాత రోజులు ఎంత బాగుండేవి..! కుశల్‌కు కూడా నా ప్రేమను వ్యక్తపరిచినట్లు తెలియజేస్తావు కదూ..!' అని సుశాంత్‌ మెసేజ్‌ పంపించాడు. ఈ సందేశం వచ్చిన వెంటనే నేను కుశల్‌తో మాట్లాడాను. 'సుశాంత్‌ సాధారణంగా ఇలాంటి సందేశాలు పంపించడు. కానీ.. కచ్చితంగా అక్కడ ఏదో జరుగుతోంది' అని అతనితో చెప్పాను. ఆ వెంటనే.. 'త్వరలోనే కులుసుకుందాం' అని సుశాంత్‌కు కుశల్‌ రిప్లై ఇచ్చాడు. కానీ జరిగేదాన్ని మనం మార్చలేం" అని సిద్ధార్థ్‌ చెప్పాడు. మిత్రుడి జ్ఞాపకాలు తలచుకొని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.