*'ఎంసీఏ' తర్వాత నాని, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఆదివారం, సాయిపల్లవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. బెంగాలీ చీరకట్టులో త్రిశూలం పట్టుకున్న కాళీకాదేవి అవతారంలో ఆమె ఆకట్టుకుంటోంది. ఇందులో సాయిపల్లవితోపాటు కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు.
*సంపూర్ణేశ్‌బాబు కొత్త సినిమాకు 'కాలీఫ్లవర్' టైటిల్‌ను ఖరారు చేశారు. ఆదివారం ఆయన పుట్టినరోజు కానుకగా ఫస్ట్ బ్యాంగ్‌ను రిలీజ్ చేశారు. గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు ఉన్న సంపూ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
*విక్రమ్, సౌమిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'కొత్తగా రెక్కలొచ్చెనా'. ఇందులో 'మనసా లేదే నిన్నలా ఈ రోజే' అంటూ సాగే మెలోడిని గాయని సునీత రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">