పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సినిమా 'వకీల్‌సాబ్'. ఇందులో పవన్ సరసన హీరోయిన్గా శ్రుతిహాసన్ నటిస్తుందంటూ ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన ఈ ముద్దుగుమ్మ.. తాను ఇందులో నటించట్లేదని స్పష్టం చేసింది.
హిందీలో విజయవంతమైన 'పింక్'కు రీమేక్ ఈ సినిమా తీస్తున్నారు. అంజలి, నివేదా థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన 'మగువా మగువా' శ్రోతల్ని అలరిస్తోంది.
ఇది పవన్ రీఎంట్రీ చిత్రం కావడం వల్ల అందరిలో అంచనాలు పెరిగాయి. దిల్‌రాజు, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి, మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా మహ్మమారి.. చిత్రబృందం ప్రణాళికను తారుమారు చేసింది.
ఇదీ చూడండి : 'కరోనా అంతమైన తర్వాత ఈ చిన్నారిలా గెంతుతా'