ETV Bharat / sitara

'జయా జీ.. అప్పుడూ ఇలానే మాట్లాడతారా?

బాలీవుడ్​లో డ్రగ్స్​ విషయమై రాజ్యసభలో సీనియర్​ నటి జయాబచ్చన్​ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది హీరోయిన్ కంగనా రనౌత్​. తన స్థానంలో జయా కూతురు శ్వేతా, తనయుడు అభిషేక్​ బచ్చన్ ఉన్నా ఇలానే మాట్లాడతారా? అని ప్రశ్నించింది.

Jaya Bachchan
జయ్​ బచ్చన్​
author img

By

Published : Sep 15, 2020, 3:01 PM IST

Updated : Sep 15, 2020, 3:13 PM IST

బాలీవుడ్​లో డ్రగ్స్​ వ్యవహారంపై దుమారం చెలరేగుతోంది. ఈ విషయమై మంగళవారం రాజ్యసభలో సీనియర్​ నటి జయాబచ్చన్​ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది హీరోయిన్ కంగనా రనౌత్​. అలా మాట్లాడటం సరికాదని చెప్పింది. చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై కరుణ చూపాలని కోరింది.

"జయ బచ్చన్​ జీ నా స్థానంలో మీరు కూతురు శ్వేతా, తనయుడు అభిషేక్​ బచ్చన్ ఉన్నా ఇలానే మాట్లాడతారా? బెదరింపులు, వేధింపులకు..​ నిరంతరం వారు గురవుతున్నా.. చివరికి ఎటువంటి పరిష్కారం దొరకక ఉరి వేసుకున్నా.. మీ సమాధానం ఇలానే ఉంటుందా? దయచేసి పరిశ్రమకు చెందిన వారిపై కాస్త కరుణ చూపండి" అంటూ ట్వీట్​ చేసింది.

  • Jaya ji would you say the same thing if in my place it was your daughter Shweta beaten, drugged and molested as a teenage, would you say the same thing if Abhieshek complained about bullying and harassment constantly and found hanging one day? Show compassion for us also 🙏 https://t.co/gazngMu2bA

    — Kangana Ranaut (@KanganaTeam) September 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం విపరీతంగా ఉందని భోజ్‌పురి నటుడు, భాజపా ఎంపీ రవి కిషన్‌ సోమవారం పార్లమెంట్‌ సమావేశాల్లో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ తీవ్రంగా మండి పడ్డారు. "అన్నం పెట్టిన చేతినే నరుక్కున్నట్లుగా ఉంది" అంటూ మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. లోక్‌సభలో చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేయడం ఎంతో సిగ్గుగా ఉందన్నారు.

ఈ వ్యాఖ్యలపై దీటుగా బదులిచ్చారు రవి కిషన్​. జయాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిత్రపరిశ్రమలో ఎవరి అండా లేకుండానే 600 చిత్రాల్లో నటించి ఎదిగానని గుర్తు చేశారు.

"చిత్ర పరిశ్రమలో జరుగుతోన్న అన్యాయంపై ఓ బాధ్యతాయుతమైన సభ్యునిగా మాట్లాడే హక్కు నాకు ఉంది. పార్లమెంట్​లో మాట్లాడటం నా కర్తవ్యం. జయ దానిని గౌరవిస్తారని భావించా. నేను కేవలం ఓ పూజారి కొడుకుగా ఎవరి సహకారం లేకుండానే 600 చిత్రాలలో నటించా."

-రవి కిషన్, భాజపా ఎంపీ, భోజ్‌పురి నటుడు.

నటుడు సుశాంత్​ రాజ్​పుత్ అనుమానాస్పద మృతి కేసులో భాగంగా పరిశ్రమలోని డ్రగ్స్​ వ్యవహారం బయటపడింది. దీంతో నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో రంగంలోకి దిగి విచారిస్తోంది. ఇందులో భాగంగానే బాలీవుడ్​, కన్నడ సహా దేశంలోని పలు చిత్రసీమల్లోని సెలబ్రిటీలకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దీనికి మద్దతుగా నిలవగా.. మరికొందరు ఖండిస్తున్నారు.

ఇదీ చూడండి చిరు గుండు లుక్... వావ్​ అనిపించే 'మేకప్​ ట్రిక్​'

Last Updated : Sep 15, 2020, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.