అనుకోని కారణాల వల్ల పెళ్లికి ముందు తామిద్దరం బ్రేకప్ చెప్పుకున్నామని శివబాలాజీ దంపతులు చెబుతున్నారు. అయితే ఆ బ్రేకప్ సంగతి కుటుంబసభ్యులకు తప్ప మరేవ్వరికి తెలియదని అన్నారు. దాని వెనుకున్న కారణమేంటో.. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వెల్లడించారు.
ఆలీ: మీ ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నా.. పెళ్లికి ముందు బ్రేకప్ అయ్యిందట?
మధుమిత: మా జీవితాల్లో ఓ బ్రేకప్ సంఘటన ఉందని కుటుంబసభ్యులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే అది మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి అలా జరగలేదు. శివబాలాజీ తల్లిదండ్రులు.. మా పెళ్లికి ముందు జాతకాలు చూపించారట. అందులో మా ఇద్దరి సెట్ అవ్వదని.. పెళ్లైతే శివ అమ్మ చనిపోతారని చెప్పారట. కానీ, నాకు జాతకాలంటే నమ్మకం లేదు. కానీ, మా అత్తమ్మ చనిపోతారని అంటుంటే దాన్ని పట్టించుకోకుండా పెళ్లి చేసుకోవాలని అనేంత మనస్థత్వం నాకు లేదు. ఆ విషయం తెలిసిన తర్వాత మేమిద్దరం ఫోన్స్‌లో మాట్లాడుకున్నాం. అప్పుడు పెళ్లి ఆలోచన వదిలేద్దామని శివ బాలాజీ చెప్పాడు. అప్పుడే పెళ్లి వద్దని అనుకున్నాం. మొదటి నుంచి ప్రేమలో పడిన తర్వాత ఇరు కుటుంబాలు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. అదే విధంగా మా వల్ల కుటుంబాలకు ఎలాంటి మనస్పర్థలు రాకూడదని భావించాం.
శివ బాలాజీ: బ్రేకప్ అయిన తర్వాత మా ఇద్దరికి విడివిడిగా పెళ్లిచూపులు చూశారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వాటన్నిటికి కాలమే సమాధానమిస్తుందని ఏడాది వేచిచూశా. కానీ.. ఆ సంవత్సరం పాటు మధుమితను ఫాలో అవుతూనే ఉన్నా. గతంలో మా జాతకాలు చూపిన వ్యక్తికే.. సంవత్సరం తర్వాత మళ్లీ జాతకాలు చూపిస్తే సెట్ అయ్యిందని అన్నారు. అలా ఇరు కుటుంబాలతో మళ్లీ మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నాం.
దీంతో పాటు శివబాలాజీ తనను ఫ్లర్ట్ చేసేవాడంటూ మధుమిత అన్నారు. అలాగే స్కూల్లో చదువుకునేటప్పుడు శివబాలాజీ 'అవుట్ స్టాండింగ్ స్టూడెంట్'గా ఎలా మారారు? తొలి సినిమా అవకాశాన్ని ఎలా చేజిక్కుంచుకున్నారనే దానిపై శివబాలాజీ వివరణ ఇచ్చారు. భార్యభర్తల బంధం గురించి వారిద్దరు ఫన్నీగా చెప్పటం ఆసక్తికరంగా ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వరుణ్‌తేజ్ బర్త్‌డే సర్ప్రైజ్.. బాక్సర్ 'గని'