ETV Bharat / sitara

నక్షత్రానికి యువహీరో సుశాంత్ సింగ్ పేరు - సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​

సుశాంత్​ సింగ్​ మరణించి నెల రోజులు కావొస్తున్నా అభిమానులు అతని జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్​ పేరు మీద ఓ అభిమాని విశ్వంలో ఏకంగా ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేశాడు.

"Shine Brightest": Sushant Singh Rajput's Fan Names Star After The Actor
సుశాంత్​
author img

By

Published : Jul 7, 2020, 11:52 AM IST

Updated : Jul 7, 2020, 1:25 PM IST

అద్భుతమైన భవిష్యత్తు కళ్ల ముందు పెట్టుకుని.. చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​. అతడికి ఖగోళ శాస్త్రం అంటే ఎంతో ఇష్టం. ఆస్ట్రో ఫిజిక్స్‌పై అనేక అధ్యయనాలూ చేశారు. విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూసేందుకు అధునాతన టెలిస్కోప్​ కూడా కొన్నారు. సుశాంత్​ సన్నిహితులు చాలా మంది.. అతనికి నక్షత్రాలను చూడటం ఎంతో ఇష్టమని చెప్పేవారు. ఖగోళ శాస్త్రం గురించి అనేక విషయాలు చెప్పేవాడని తెలిపారు. అయితే, సుశాంత్​ ఇష్టాలు తెలుసుకున్న రక్ష అనే అభిమాని.. అతడి పేరు మీద ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్టార్​కు సుశాంత్​ పేరు పెట్టినట్లు.. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశాడు.

"సుశాంత్​కు నక్షత్రాలంటే చాలా ఇష్టం. అందుకే, వాటిలో ఒక దానికి ఆయన పేరు పెట్టడం మంచిదనిపించింది. ఇకపై ఆ నక్షత్రం మరింత ప్రకాశవంతంగా మెరవాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరి కృతజ్ఞతను నేను అభినందిస్తున్నా. సుశాంత్​పై నా ప్రేమ తెలిపేందుకు ఇదో చిన్న ప్రయత్నం మాత్రమే." అంటూ రక్ష ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

  • Filmfare,

    I would like to clarify that I did not purchase the star as it is not property that can be bought. However, I believe I was able to name it after him as the website states. Although I appreciate everyone’s gratitude, it was simply a small gesture to convey my love. https://t.co/33xViTBqFP

    — raksha ♡ (@xAngelWingz) July 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విశ్వంలో ఉండే తారల్లో ఒకటైన ఆర్​ఏ 22.121కు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ హక్కులు కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:'అప్పటి వరకు కరోనాను భరించాల్సిందే'

Last Updated : Jul 7, 2020, 1:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.