ETV Bharat / sitara

'మహాసముద్రం'లో శర్వానంద్​ ఫిక్స్

author img

By

Published : Sep 7, 2020, 1:22 PM IST

హీరో శర్వానంద్.. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. దీనికి 'మహాసముద్రం' టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Sharwanand Starrar Telugu-Tamil bi-lingual directed by Ajay Bhupathi  titled as MahaSamudram
శర్వానంద్​

తొలిచిత్రం 'ఆర్‌ఎక్స్‌ 100'తోనే సంచలన హిట్​ కొట్టారు దర్శకుడు అజయ్ భూపతి. రెండో సినిమాగా 'మహాసముద్రం' తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ కుదరలేదు. ఇప్పుడు దానిపై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఏకే ఎంటర్​టైన్మెంట్స్ నిర్మాణంలో శర్వానంద్​ హీరోగా తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు'తో ఘనవిజయాన్ని అందుకున్నారు ఏకే ఎంటర్​టైన్మెంట్స్ అధినేత అనిల్​ సుంకర.

Sharwanand Starrar Telugu-Tamil bi-lingual directed by Ajay Bhupathi  titled as MahaSamudram
'మహాసముద్రం' అనౌన్స్​మెంట్​

'ఆర్​ఎక్స్​ 100' తరహాలోనే ఉండే విభిన్న కథతో ఈ సినిమా తీయనున్నట్లు అజయ్​ భూపతి ఇదివరకే చెప్పారు. తెలుగు-తమిళ భాషాల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రతి వారం ఓ అప్​డేట్​ ఇవ్వనున్నట్లు తెలిపింది.

ఈ చిత్రం కోసం శర్వానంద్​తో సహా మరో నటుడ్ని ఎంపిక చేస్తారని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం హీరో సిద్ధార్థ్​ను, హీరోయిన్​గా సమంతను చిత్రబృందం సంప్రదించినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.