ETV Bharat / sitara

శంకర్​-రణ్​వీర్​ కాంబోలో 'అపరిచితుడు 2'! - రణ్​వీర్​ సింగ్​ శంకర్​

దర్శకుడు శంకర్.. బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​తో 'అన్నియన్'​ తెలుగులో 'అపరిచితుడు' సీక్వెల్​ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

Shankar-Ranveer singh combo
శంకర్​-రణ్​వీర్​ కాంబో
author img

By

Published : Apr 11, 2021, 5:31 AM IST

2005లో ప్రముఖ దర్శకుడు శంకర్​-హీరో విక్రమ్​ కాంబోలో వచ్చిన 'అన్నియన్', తెలుగులో 'అపరిచితుడు'​గా విడుదలై.. రెండు భాషల్లోనూ ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్​ రూపొందించే ప్రయత్నాలో శంకర్​ ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

శంకర్​-బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​ కాంబోలో ఓ పాన్​ ఇండియా సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయని కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అది 'అన్నియన్'​కు సీక్వెల్​ అని ప్రస్తుతం కోలీవుడ్​ వర్గాల్లో టాక్​. ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.

ప్రస్తుతం శంకర్ కమల్​హాసన్​తో తెరకెక్కిస్తున్న 'భారతీయుడు 2' సినిమాను పక్కనపెట్టి, హీరో రామ్​చరణ్​తో ప్రతిష్ఠాత్మకంగా ఓ భారీ ప్రాజెక్ట్​ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు. ఇది పూర్తవ్వగానే 'అన్నియన్'​ సీక్వెల్​ సెట్స్​పైకి వెళ్తుందని తెలిసింది. మరోవైపు రణ్​వీర్​.. త్వరలోనే 'సూర్యవంశీ', '83' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం 'జయేష్​భాయ్ జోర్దార్'​, 'సర్కస్'​ సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: పెళ్లి తర్వాత కెరీర్​పై మెహరీన్ ఏమందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.