ETV Bharat / sitara

'ఆర్​సీ 15' నాన్​ థియేట్రికల్​ రైట్స్​కు రికార్డు ధర! - rc 15 movie heroine

Ramcharan-Shankar movie: రామ్​చరణ్​-శంకర్​ కాంబోలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న 'ఆర్​సీ 15' సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్​మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీ నాన్​ థియేట్రికల్​ హక్కులను ప్రముఖ సంస్థ 'జీ'.. రూ.200కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

Shankar-Ramcharan movie
Shankar-Ramcharan movie
author img

By

Published : Jan 17, 2022, 3:41 PM IST

Ramcharan-Shankar movie: మెగాహీరో రామ్​చరణ్​ సరికొత్త బెంచ్​మార్క్​ను సెట్​ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ఆర్​ఆర్​ఆర్'​తో దేశవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్న ఆయన.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకోబోతున్నారు! ఆయన తన తర్వాతి సినిమాను ప్రముఖ దర్శకుడు శంకర్​తో చేస్తున్నారు. పాన్​ ఇండియా మూవీగా 'ఆర్​సీ 15' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ మూవీ నాన్​ థియేట్రికల్​ రైట్స్​ను భారీ ధరకు ప్రముఖ సంస్థ 'జీ' సొంతం చేసుకుందని తెలుస్తోంది. రూ.200కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. ఇండియన్​ సినిమాలో ఇది ఒక బిగ్గెస్ట్​ డీల్.

ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రూ.300కోట్లతో ఈ మూవీని రూపొందించనున్నారట! పొలిటికల్​ థ్రిల్లర్​గా తెరకెక్కించనున్న ఈ సినిమాకు తమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల 135 మంది మ్యూజిషియన్లతో కలిసి ఆయన ఈ సినిమాకు సంబంధించిన​ తొలి రికార్డింగ్​ పూర్తి చేశారు. కొరియోగ్రాఫర్​గా జానీ మాస్టర్, మాటల రచయితగా సాయి మాధవ్​ బుర్రాను ఇప్పటికే ఎంపిక చేసింది చిత్రబృందం. సునీల్​, అంజలి, శ్రీకాంత్​, నవీన్​చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలన్​గా మలయాళ నటుడు ఫహాద్​ ఫాజిల్​నటిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదీ చూడండి: ఆరు నిమిషాల్లో ఆ పాట రాసిన హీరో ధనుష్.. ఇంతకీ ఎలా సాధ్యం?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.