ETV Bharat / sitara

'మహాభారతం'లో కర్ణుడిగా షాహిద్​ కపూర్​! - మహాభారతం సినిమా వార్తలు

బాలీవుడ్​ ప్రముఖ దర్శకనిర్మాత రాకేష్​ ఓం ప్రకాష్​ మెహ్రా 'మహాభారతం' చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కర్ణుడి పాత్ర కోసం హీరో షాహిద్​ కపూర్​ను ఎంపిక చేశారని సమాచారం. అయితే ఈ చిత్రం పౌరాణిక నేపథ్యమా? ఆధునిక సమకాలిన అంశాల సమాహారమా? అనేది తెలియాల్సిఉంది. ​

Shahid Kapoor to essay Karna in Rakeysh Omprakash Mehra's Mahabharat adaption?
'మహాభారతం'లో కర్ణుడిగా షాహిద్​ కపూర్​!
author img

By

Published : Jan 18, 2021, 8:39 AM IST

Updated : Jan 18, 2021, 8:44 AM IST

బాలీవుడ్‌‍లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నారు హీరో షాహిద్‌ కపూర్‌. 'కబీర్‌ సింగ్‌' చిత్రంతో తన పారితోషికం పెంచేశాడని వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆయన 'జెర్సీ' హిందీ రీమేక్​ చిత్రంతో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రముఖ దర్శకనిర్మాత రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రా రూపొందించనున్న 'మహాభారతం' చిత్రంలో కర్ణ పాత్రలో షాహిద్​ నటించనున్నారని సమాచారం. అయితే ఇది పౌరాణికం అవుతోందా? లేదా ఆధునిక సమకాలిన అంశాలతో ఉంటుందా? అనే దానిపై స్పష్టత రాలేదు.

బాలీవుడ్ వర్గాల ప్రకారం షాహిద్‌ కపూర్‌ సూర్యపుత్రుడు కర్ణుడిగా నటిస్తున్నారని తెలుస్తోంది. రాకేష్‌ ఓం ప్రకాష్‌ మెహ్రాకు కర్ణుడి జీవితాధారంగా ఓ సినిమా చేయాలని చిరకాల కలగా ఉందట. ప్రస్తుతం చిత్రానికి తాత్కాలికంగా 'కర్ణ' అనే పేరు పెట్టనున్నారని సమాచారం. రోనీ స్ర్కూవాలా సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరోవైపు షాహిద్‌ కపూర్‌ 'జెర్సీ' రీమేక్​ తర్వాత రాజ్‌ నిడమోరు - డి.కె.కృష్ణల నిర్మించనున్న ఓ వెబ్‌సీరీస్‌లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారని బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చూడండి: 'తాండవ్'​ ఎఫెక్ట్​.. సైఫ్​ అలీఖాన్​ ఇంటికి భద్రత

Last Updated : Jan 18, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.