ETV Bharat / sitara

అట్లీ దర్శకత్వంలో షారుక్, దీపిక రొమాన్స్​! - srk deepika padukone next film

బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ షారుక్​ ఖాన్‌, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్​లో ఓ సినిమా దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్​గా నటించనున్నట్లు తెలుస్తోంది.

SRK
షారుఖ్
author img

By

Published : Sep 12, 2020, 9:26 PM IST

బాలీవుడ్ సూపర్​స్టార్ షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమాకు 'సంకీ' అనే పేరు పెట్టినట్లు వార్తలు వినిపించాయి. దీనిపై కింగ్ ఖాన్ పుట్టినరోజైన నవంబర్​ 2న చిత్రబృందం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ చిత్రంలో షారుక్ సరసన ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్​. ఇటీవలే నిర్మాతలు ఆమెకు కథ వినిపించగా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చిందట. వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్​ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

SRK
షారుఖ్​, దీపిక

షారుక్, దీపిక కలయికలో గతంలో అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్​ హిట్​గా నిలవడం విశేషం. ఈ క్రమంలోనే మరో సారి ఈ జోడీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

కాగా షారుక్​ చివరగా 'జీరో' చిత్రంతో రాగా ఆ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది. దీంతో సరికొత్త కథతో అభిమానులను అలరించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 30 కథలను తిరస్కరించాడట షారుక్​. చివరకు ముగ్గురు దర్శకులకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. వారిలో రాజ్‌కుమార్‌ హిరాణీ, రాజ్‌ - డీకే, అట్లీ​ల పేర్లు వినిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.