ETV Bharat / sitara

బాలీవుడ్ బాద్​షా: షారుక్​ గురించి ఈ విషయాలు తెలుసా?

షారుక్​ ఖాన్ అనగానే స్టార్ హీరో, టీవీ వ్యాఖ్యాత, ఐపీఎల్​లో కోల్​కతా జట్టు యజమాని అనే గుర్తొస్తాయి. కానీ ఆయన గతంలో ఓసారి జైలుకు వెళ్లారని, ఇంట్లో ఇస్లామ్ ప్రార్ధనలతో పాటు, హిందు దేవుళ్లను పూజిస్తారని మీకు తెలుసా?

shah rukh birthday: 10 unknown facts about shah rukh khan
షారుక్​ ఖాన్
author img

By

Published : Nov 2, 2020, 12:15 PM IST

బాలీవుడ్‌ చరిత్రలో 14 ఫిల్మ్​ఫేర్​ అవార్డులు అందుకున్న అరుదైన నటుడు షారుక్ ఖాన్‌. మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు అత్యంత ఆప్తుడు. బాలీవుడ్‌ బాద్​షాగా పిలుచుకునే ఆయన.. సోమవారం(నవంబరు 2) 66వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా షారుక్​ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.

  1. షారుక్​, 1991 అక్టోబర్‌ 25న హిందూ సంప్రదాయ పద్ధతిలో పంజాబీ అమ్మాయి గౌరీ చిబ్బర్​ను(గౌరీ ఖాన్‌) పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల తరవాత వారికి 1997లో ఆర్యన్, 2000లో సుహానా పుట్టారు. 2013లో అభిరామ్‌ జన్మించాడు. ఈయన ఇంటిలో హిందూ దేవతల విగ్రహారాధనతో పాటు ఇస్లామ్ ప్రార్ధనలు కూడా చేస్తారు.
  2. షారుక్​ ఖాన్‌ కేవలం నటుడే కాదు... ఒక మంచి నిర్మాత, బుల్లితెర ప్రయోక్త, సామాజిక కార్యకర్త, ధార్మికుడు కూడా. ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేసి, హీరోగా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.
    shah rukh birthday
    దూరదర్శన్ టీవీ వ్యాఖ్యాతగా షారుక్ ఖాన్
  3. షారుక్ సొంతంగా 'రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌' అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. దీని ద్వారా సినిమా నిర్మాణం, అడ్వర్​టైజింగ్, విజువల్‌ ఎఫెక్ట్స్, టెలివిజన్‌ సీరియళ్ల నిర్మాణం లాంటివి చేస్తున్నారు. సంస్థ వ్యవహారాలను భార్య గౌరీ ఖాన్‌ చూస్తున్నారు.
  4. అభిమానులు, ఆదాయపు పన్ను చెల్లించే నటుల జాబితాలో షారుక్ ముందు వరుసలో ఉంటారు. ఈయన నటించిన దాదాపు 80 సినిమాలు హిట్​ కావడం అదృష్టమే కాదు, ఆయన కృషికి సంకేతం.
  5. షారుక్​ ఖాన్‌కు పాటలు పాడడమంటే సరదా. 'జోష్‌' సినిమాలో 'అపున్‌ బోలా తూ మేరీ లైలా' పాటను, 'డాన్‌'లో ఉదిత్‌ నారాయణ్‌తో కలిసి 'ఖైకే పాన్‌ బనారస్‌ వాలా, ఖుల్‌ జాయే బంద్‌ అకల్‌ కా తాలా' పాటను, 'జబ్‌ తక్‌ హై జాన్‌'లో టైటిల్‌ పద్యం ఆలపించారు. తన సొంత సినిమా 'ఆల్వేస్‌ కభి కభి'కు పాటలను స్వరపరచడంలో తనవంతు కృషి చేశారు.
    shah rukh birthday
    స్టార్ కథానాయకుడు షారుక్ ఖాన్
  6. ఫిల్మ్ ఫేర్, జీ సినీ, స్కీన్ర్‌ అవార్డ్‌ కార్యక్రమాలకు ప్రయోక్తగా, 'కౌన్‌ బనేగా కరోడ్‌ పతి' టెలివిజన్‌ షోకు సంధానకర్తగా షారుక్ వ్యవహరించారు. 'ఇండియా నయీ సోచ్‌' లాంటి టాక్‌ షోలకు యాంకర్​గా చేశారు. మలేసియాలో ఆశా భోంస్లే సంగీత కార్యక్రమాలకు ప్రయోక్తగా, ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు యజమానిగా వ్యవహరిస్తున్నారు. పల్స్‌ పోలియో, ఎయిడ్స్‌ నిర్మూలన లాంటి ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలకు రాయబారిగా ఉన్నారు.
  7. ఉత్తమ నటుడిగా 30 సార్లు ఫిల్మ్ ఫేర్​కు నామినేట్‌ అయిన ఒకే ఒక్క నటుడు షారుక్ ఖాన్‌. అందులో 14 సార్లు ఆ అవార్డును సొంతం చేసుకున్నారు. 2005లో భారత ప్రభుత్వం 'పద్మశ్రీ' ప్రదానం చేసింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం డాక్టరేట్‌ను, అత్యున్నత సివిలియన్‌ అవార్డును ఇచ్చి గౌరవించింది.
  8. ఆన్​స్క్రీన్​ అయినా, ఆఫ్ స్క్రీన్​ అయినా బాలీవుడ్​ బాద్​షా కారు నంబరు '555' ఉంటుంది. ఆ సంఖ్య ఉన్న వాహనాన్నే షారుక్ నడుపుతారు. వేరేదైతే డ్రైవర్ ఉండాల్సిందే.
    shah rukh birthday
    షారుక్ ఖాన్ కారు నంబరు 555
  9. "సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఓ ఎడిటర్​ నా గురించి, నా సహనటి గురించి తప్పుగా కథనాలు​ రాశాడు. అవి చదివిన నేను, ఎందుకు ఈ విధంగా చేశాడోనని అతడిని అడిగాను. ఈ విషయాన్ని సిల్లీగా తీసుకున్నాడు. అందుకే తన ఆఫీస్​కు వెళ్లి గొడవపడి హెచ్చరించాను. ఆ తర్వాత యథావిధిగా షూటింగ్​కు వెళ్లిపోయాను. అప్పుడు పోలీసులు నా దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడాలని అన్నారు. స్టేషన్​కు రావాలని కోరారు. జరిగిన గొడవపై నన్ను అరెస్టు చేస్తున్నామన్నారు. ఆ సమయంలో వారిని ఎంతగానో ప్రాధేయపడ్డాను. కానీ వారు వినలేదు. కొన్ని గంటలపాటు జైలులో గడపవలసి వచ్చింది. ఆ తర్వాత బెయిల్​పై బయటికి వచ్చాను" అని షారుక్ గతంలో తనకు జరిగిన అనుభవాన్ని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.