ETV Bharat / sitara

'మాస్టర్​' విడుదలకు అనుమతివ్వొద్దు: దర్శకుడు కేయార్​ - letter to tamil CM to doesnot allow to release Master movie

తమిళ హీరో విజయ్ నటించిన 'మాస్టర్​' చిత్రం విడుదలకు అనుమతి ఇవ్వొద్దని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు సీనియర్​ దర్శకుడు కేయార్. లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో ఈ చిత్ర వీక్షించేందుకు ప్రేక్షకులు ఎక్కువగా వస్తారని.. దాని వల్ల వైరస్​ మరింత వ్యాప్తి చెందుతుందని లేఖలో పేర్కొన్నారు. ఫలితంగా హీరో విజయ్​కు ఉన్న మంచిపేరు పోతుందని అభిప్రాయపడ్డారు.

Senior Tamil Director requests CM not to allow Master release after lockdown
'మాస్టర్​' విడుదలను ఆపి వేయమంటున్న దర్శకుడు!
author img

By

Published : Jun 5, 2020, 11:04 AM IST

అగ్ర కథానాయకుడు విజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మాస్టర్‌'. 'ఖైదీ' ఫేమ్‌ లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో నటించారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా 'మాస్టర్‌' సినిమా విడుదలలో జాప్యం జరిగింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుంటోంది.

మరోవైపు సామాజిక దూరం, ఇతర నిబంధనలను పాటిస్తూ జులై నుంచి థియేటర్లు పునఃప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతివ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో థియేటర్లు ఓపెన్‌ కాగానే మొదటి చిత్రంగా 'మాస్టర్‌' విడుదల చేయాలని థియేటర్‌ యజమానులు భావిస్తున్నారు. ఈ చిత్ర ప్రదర్శనతో థియేటర్లు ప్రేక్షకులతో కళకళలాడతాయని భావిస్తున్నారు.

Senior Tamil Director requests CM not to allow Master release after lockdown
'మాస్టర్​' సినిమాలో విజయ్​

సీనియర్‌ దర్శకుడు, నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు కేయార్‌.. 'మాస్టర్‌' విడుదల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. థియేటర్లు పునఃప్రారంభమైన వెంటనే మొదటిగా 'మాస్టర్‌' చిత్రాన్ని ప్రదర్శించడానికి అనుమతివ్వవద్దని కోరారు. ఆ చిత్రాన్ని విడుదల చేస్తే ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, దానివల్ల కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశముందని అభిప్రాయపడ్డారు. అదే జరిగితే విజయ్‌కి ఉన్న మంచిపేరు పోతుందని పేర్కొన్నారు.

ఆర్థిక వ్యవస్థ కంటే ముందు ప్రజల సంక్షేమం ముఖ్యమని ఆయన తెలిపారు. సినీ నిర్మాతలకు విధించే 26 శాతం వినోద పన్ను.. రానున్న మూడు నెలలు మాఫీ చేయాలని కోరారు.

'మాస్టర్‌' చిత్రానికి అనిరుధ్‌ స్వరాలు అందించారు. ఈ చిత్రంలోని 'వాతి కమ్మింగ్‌' అనేపాట ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. తాజాగా ఈ పాట 5 కోట్ల వీక్షణలు సొంతం చేసుకుని యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది.

ఇదీ చూడండి... 'నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా నవ్వించగలగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.