ETV Bharat / sitara

ఇండస్ట్రీ ఏదైనా హవా ఈమెదే.. అన్నీ సూపర్​ హిట్లే!

తనదైన నటనతో అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది మాజీ హీరోయిన్​ అసిన్​. సోమవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా.. అసిన్ గురించి మీకు తెలియని విషయాలు

Asin
ఆసీన్​
author img

By

Published : Oct 26, 2020, 5:31 AM IST

గ్లామర్​‌ క్వీన్‌ అసిన్‌. కేరళ కొబ్బరితోటల్లో పుట్టి పెరిగిన ఈ అందం.. తమిళ సాంబారు రుచి కూడా చూసింది. మధ్యలో తెలుగింటి ఆవకాయ కూడా నంజుకుంది. తరువాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. ప్రతిభ చూపితే హిందీలో నెగ్గుకురావొచ్చు అని దక్షిణాది భామలకు స్ఫూర్తినిచ్చిన నాయిక ఈమె. తనను చూసే పలువురు భామలు హిందీకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో తనదైన ముద్ర వేసిన అసిన్‌.. హిందీలోను అగ్రకథానాయికగా వెలిగింది. బిలియన్‌ మార్కు చేరుకున్న పలు చిత్రాల్లో నటించి అలరించింది. సోమవారం(26 అక్టోబర్‌) ఈ అందాల సుందరి పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

కేరళలో బాల్యం

కేరళ కొచ్చిలో 1985 అక్టోబర్‌ 26న పుట్టింది. తండ్రి పేరు జోసఫ్‌ తొట్టుముక్కల్‌. పలురకాల వ్యాపారాలు చేస్తుంటారు. తల్లి సెలిన్‌ తొట్టుముక్కల్‌ వైద్యురాలు. కల్మషం లేని పరిశుద్దమైన మనసు అనే అర్థం వచ్చేలా అసిన్‌ అని పేరు పెట్టారు. ఎల్​కేజీ నుంచి పదోతరగతి వరకు కొచ్చిలోని నావల్‌ పబ్లిక్‌ స్కూల్లోనే చదువుకుంది. పదిలో తొంభై శాతం మార్కులతో పాసయ్యింది. సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ప్లస్‌ టు చదవుపూర్తి చేసి, యమ్‌జి విశ్వవిద్యాలయం నుంచి బి.ఎ పట్టా పుచ్చుకుంది.

Asin
ఆసిన్​

అలా సినిమాల్లోకి

స్కూల్లో ఉన్నప్పుడే మోడలింగ్‌ చేసే అవకాశం అసిన్​కు లభించింది. అలా తొలుత టీవీ ప్రకనల్లో నటించింది. పదిహేను సంవత్సరాల వయసులోనే మలయాళ చిత్రం ‘నరేంద్ర మకాన్‌ జయకాంతన్‌ వాకా'లో నటించింది. అనంతరం డిగ్రీ పూర్తయ్యాక 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' చిత్రంతో తెలుగులోకి ప్రవేశించింది.

ఇక్కడ తొలి చిత్రమే హిట్‌ సాధించడం వల్ల అసిన్‌కు వరుసగా లక్ష్మీనరసింహ, శివమణి, ఘర్షణ లాంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అవి కూడా సూపర్​ హిట్​గా నిలిచాయి. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి తమిళంలో కూడా రీమేకైంది. అక్కడ హిట్ కావడం వల్ల తమిళ, తెలుగు భాషల్లో బిజీ అయిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

గజిని, శివకాశి, వరలారు, అల్వార్‌, దశావతారం సినిమాలతో తమిళంలో విజయాలు అందుకోగా, తెలుగులో చక్రం, అన్నవరం చిత్రాలతో మంచి పేరే తెచ్చుకుంది. మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన 'గజిని' హిందీలో రీమేక్‌ చేయాలని ఆమిర్‌ఖాన్‌ నిర్ణయించడం వల్ల అసిన్‌ పంట పండింది. అందులోనూ కథానాయికగా ఈమె ఎంచుకొన్నారు. దీంతో అప్పటి వరకు దక్షిణాదికే పరిమితమైన అసిన్‌ హిందీకి వెళ్లిపోయింది. బాలీవుడ్​లో చేసిన తొలి చిత్రమే వందకోట్లు వసూళ్లు సాధించింది.

లండన్‌ డ్రీమ్స్‌, రెడీ, హౌస్‌ఫుల్‌2, బోల్‌బచ్చన్‌, కిలాడి 786 తదితర హిందీ చిత్రాల్లో నటించి స్టార్‌గా గుర్తింపు తెచ్చుకుంది. చివరగా హిందీలో 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' చిత్రంలో నటించింది. ఈ క్రమంలోనే 2016లో పారిశ్రామిక వేత్త రాహుల్‌ శర్మను అసిన్‌ పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చింది​.

ఏడు భాషలు..

అసిన్​కు ఏడు భాషలు మాట్లాడటం వచ్చు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, మరాఠీ, గుజరాతి, ఫ్రెంచ్‌ భాషలు అనర్గళంగా వచ్చు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా కెవ్లో పదం వాడుతుంది. ఆ పదానికి అర్థమేమిటో మీరే కనుక్కోండి అంటోంది.

Asin
ఆసిన్​

పేరుతోనే పిలవాలి..

ఎవరైనా ముద్దు పేర్లతో పిలిస్తే అసిన్​కు చిరాగ్గా ఉంటుందట. చాలా మంది అస్సి అని పిలుస్తుంటారు. అలా పిలిస్తే చాలా కోపం వస్తుందట. ఎంచక్కా అసిన్‌ అనే పేరు ఉంది కదా. పూర్తి పేరుతో పిలువొచ్చుగదా అంటోంది.

ఆ రెండే..

షాపింగ్‌ చేయడం అంటే ఈమెకు చాలా ఇష్టం. ఎక్కువగా ఏం కొంటుందో తెలుసా? ఈ విషయం చెబితే అందరు నవ్వుకుంటారు. చిప్స్‌, చాకోలేట్స్.. బయటకి వెళ్తే ఈ రెండే గుర్తుకొస్తాయట ఈ అమ్మడికి.

నవ్వడం మొదలు పెడితే..

తన స్నేహితులతో చాలా సరదాగా గడుపుతుంటుంది అసిన్​. ఎప్పుడైనా ఖాళీ దొరికితే అందరికి ఫోన్లు చేసి పిలుస్తుంది. స్నేహితులంతా కలిసి ఒక చోట చేరి బొలెడన్నీ కబుర్లు చెప్పుకుంటుంటారు. వాళ్ల బ్యాచ్‌ కలిస్తే సందడే సందడి. ఆ సమయంలో ఎవరో ఒకరు సరదాగా జోకు చెబుతే ఇక నవ్వులే నవ్వులు. నా నవ్వు ఆపడం ఎవరి తరంకాదు. నవ్వు నాకొక చెడ్డ అలవాటు అని అంటోంది‌.

ఖాళీ సమయంలో..

సందుదొరికితే చాలు విపరీతంగా సినిమాలు చూస్తుంటుంది ఆసిన్​. పాత చిత్రాలంటే చాలా ఇష్టం. మోహన్‌లాల్‌ నటించిన కిఝుకుమ్, హాలీవుడ్‌లో ది సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్..‌ ఈ రెండు చిత్రాలను లెక్కలేనన్ని సార్లు చూసింది.

వంట గురించి..

వంట చేయడం వచ్చు. పుట్టు, బ్రెడ్‌టోస్ట్, దోశెలు, ఇడ్లీ, నూడుల్స్ ‌లాంటివి చేస్తుంది. ఉడకబెట్టిన గుడ్లుతో రకరకాల పదార్థాలు చేస్తుంది.

Asin
ఆసిన్​

పదే పదే అలాంటివే చేస్తుంది..

తనకు ఓ జబ్బు ఉందట. అందేంటంటే? ఆబెస్సివ్‌ కంపెల్సివ్‌ డిజార్డర్‌. ఇదో మానసిక జబ్బు. తిన్న తర్వాత పదే పదే చేతులు కడగడం.. కారుకూ, ఇంటికీ డోర్‌ వేశానో లేదో పదేపదే చెక్‌ చేసుకోవడం. ఇంకా ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయట. అందుకే సెట్‌లో షాట్‌ ఓకే అయ్యే వరకు అసలు తినదు. షూటింగ్‌ పూర్తయ్యాకే తింటుందీ భామ.

మంచి చెడు.

ఎక్కువగా తను పోషించే పాత్ర గురించి పదేపదే ఆలోచన చేస్తుంది అసిన్​. ఆ సమయంలో పెంపుడు కుక్కతో తన సమయాన్ని గడుపుతుంది. పుస్తకాలు మాత్రం విపరీతంగా చదువుతుంది. చేతిలో పుస్తకం లేకపోతే ఆలోచనలు ఎక్కడికో వెళ్లాపోతాయంట మరి! ఈ అలవాటు మంచిదే అయినా అప్పుడప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్తుంది.

ఇదీ చూడండి ఇది దసరా కాదు.. టాలీవుడ్​ అప్​డేట్ల పండగ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.