గ్యాప్.. బ్రేక్.. రీఎంట్రీ.. ఈ మాటలు చిత్రసీమకు, సినీప్రియులకు కొత్తేం కాదు. వెండితెరపై తమదైన ప్రతిభతో సత్తా చాటిన సినీతారలంతా.. కెరీర్‌లో ఏదోక సందర్భంలో ఈ మాటల్ని వినిపించక తప్పదు. దీనికి దర్శకులూ మినహాయింపు కాదు. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో స్టార్ డైరెక్టర్లుగా మెరుపులు మెరిపించిన వాళ్లెవరూ.. ఇప్పుడు బాక్సాఫీస్ ముందు అంతగా కనిపించడం లేదు. కె.విశ్వనాథ్, సింగీతం శ్రీనివాసరావు లాంటి దిగ్గజ దర్శకులు వయసు రీత్యా మెగాఫోన్‌ను పక్కకు పెట్టగా.. కె.రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి వారు వ్యక్తిగతంగానే సినిమాలకు కాస్త విరామమిచ్చారు. అయితే ఇప్పుడీ జాబితాలోని పలువురు అగ్ర దర్శకులు మళ్లీ తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
కొత్త కథా చిత్రాలతో
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కొంత విరామం తర్వాత కొత్త కబురు వినిపించారు. తన సినీ కెరీర్‌లో అపురూప విజయాల్లో ఒకటిగా నిలిచిన పెళ్లి సందడి' చిత్రం పేరుతోనే.. మరో కొత్త సినిమా రూపొందించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారాయన. ఆర్.కె.ఫిల్మ్, ఆర్కా మీడియా సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతుంది. వినోదభరిత కుటుంబ కథా చిత్రాలతో మెప్పించిన సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 2014లో వచ్చిన 'యమలీల 2' తర్వాత ఆయన నుంచి మరో చిత్రమేదీ బయటకు రాలేదు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఓ వైవిధ్యభరిత చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ఇప్పటికే కథ సిద్ధమైందని, వచ్చే ఏడాదిలో ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ఇది పూర్తయ్యాక 'వినోదం' చిత్రానికి సీక్వెల్‌గా వరుస సినిమాలు తీసుకొచ్చేందుకు ప్రణాళిక రచించారు ఎస్వీ కృష్ణారెడ్డి. వాణిజ్య పరంగా తెలుగు సినిమా స్థాయిని పెంచిన అగ్ర దర్శకుడు బి.గోపాల్ సైతం త్వరలోనే మళ్లీ మెగాఫోన్ అందుకోబోతున్నారు. లారీ డ్రైవర్, బొబ్బిలిరాజా, సమర సింహారెడ్డి, ఇంద్ర లాంటి హిట్లతో బాక్సాఫీస్‌ను కళకళలాడించిన ఆయన.. మూడేళ్లుగా సినిమాల నుంచి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడాయన అగ్ర హీరో బాలకృష్ణ కోసం ఓ చక్కటి కథ సిద్ధం చేస్తున్నారని సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే బాలకృష్ణ 107వ చిత్రంగా ఇది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
-
Stay tuned.. pic.twitter.com/16uMDrNHbf
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Stay tuned.. pic.twitter.com/16uMDrNHbf
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2020Stay tuned.. pic.twitter.com/16uMDrNHbf
— Raghavendra Rao K (@Ragavendraraoba) October 7, 2020
'ప్రభాస్ 21' కోసం సింగీతం..
తెలుగు చిత్రసీమలో ప్రయోగాలకు పెట్టింది పేరు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. 'పుష్పక విమానం', 'విచిత్ర సోదరులు', 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం' లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పించిన ఈ దర్శక దిగ్గజం.. ఇప్పుడు ప్రభాస్ 21వ చిత్రం కోసం మళ్లీ రంగంలోకి దిగారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం కోసం ఆయన స్క్రిప్ట్ మెంటార్‌గా పని చేస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లబోతుంది. ఇక ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా 'ఆదిత్య 369'కి సీక్వెల్‌గా ఓ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే ఈ క్రేజీ సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి.
ఇదీ చూడండి 'నువ్వేకావాలి' మరోసారి చూడాలంటే?