అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై(actor satyanarayana health bulletin) అపోలో వైద్యులు ఆదివారం సాయంత్రం ప్రత్యేక బులిటెన్ విడుదల చేశారు. ఆయనకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతోన్న సత్యనారాయణ శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురి కావడం వల్ల కుటుంబసభ్యులు ఆయన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై(actor satyanarayana health update) అపోలో వైద్యులు మాట్లాడుతూ.. కైకాల స్పృహలోనే ఉన్నారని, అయితే, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వివవరించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. బీపీ లెవల్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల వాసో ప్రెజర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని చెప్పారు. మరోవైపు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన క్షేమంగా తిరిగి రావాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'భీమ్లా నాయక్' చెప్పిన తేదీకే.. రిలీజ్ డేట్స్‌తో శ్రియ, రకుల్