ETV Bharat / sitara

లగ్జరీ క్యారవాన్​​ కొనుగోలు చేసిన నరేశ్​ - లక్సరీ కారవన్​

సినీనటుడు నరేశ్ సకల సౌకర్యాలు ఉండేలా ఓ కొత్త లగ్జరి క్యారవాన్​ను కొనుగోలు చేశారు. ముంబయి నుంచి దాన్ని ప్రత్యేకంగా తెప్పించుకున్నారు. దీనికోసం ఆయన భారీగానే ఖర్చు పెట్టారు.

Senior Actor Naresh buys Luxury caravan
లగ్జరీ కారవ్యాన్​ కొనుగోలు చేసిన నరేశ్​
author img

By

Published : Jan 25, 2022, 12:25 PM IST

క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్నారు సీనియర్‌ నటుడు నరేశ్‌. ఈ ఏడాదిలో తన చేతి నిండా సినిమాలున్నాయని ఇటీవల నరేశ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఆయన ఇంట్లో కంటే క్యారవాన్​లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇతర నటీనటులు వాడిన క్యారవాన్​ను వాడటం మంచిది కాదని భావించిన ఆయన ఇటీవల ప్రత్యేకంగా ఓ వ్యాన్‌ను కొనుగోలు చేశారు. తన అభిరుచులకు అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేయించుకున్నారు. ఏసీతో ఉన్న ఈ వ్యాన్‌లో బెడ్‌, మేకప్‌ ప్లేస్‌, జిమ్‌, వెయిటింగ్‌ రూమ్‌, వాష్‌రూమ్ వంటివి ఉన్నాయి. అన్ని సౌకర్యాలతో సిద్ధమైన ఈ వ్యాన్‌ను ఆయన ముంబయి నుంచి తెప్పించుకున్నారు. దీనికోసం ఆయన భారీగానే ఖర్చు పెట్టారు.

"నటీనటులకు క్యారవాన్​లు మరో ఇల్లు లాంటివి. నా జీవితంలో 70 శాతం ఈ వాహనాల్లో గడిచిపోతుంటుంది. దాంతో కార్ల కోసం ఖర్చుపెట్టే బదులు.. మంచి క్యారవాన్​ కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వేరే వాళ్లు వాడిన క్యారవాన్​లో ఉండటం కూడా అంత ఉత్తమం కాదు. నా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని కొనుగోలు చేశాను" అని నరేశ్‌ చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

మెగాస్టార్​ సరసన త్రిష.. 16ఏళ్ల తర్వాత మళ్లీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.