ETV Bharat / sitara

మరో కుంభకోణంపై 'స్కామ్‌ 1992' సీజన్‌-2!

విశేష ఆదరణ దక్కించుకున్న 'స్కామ్​ 1992' వెబ్​సిరీస్​ సీజన్​ 2గా 'స్కామ్​ 2003 : ది క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీ' రాబోతుంది. ఈ సిరీస్​కు సంబంధించిన నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

scam
స్కామ్​ 1992
author img

By

Published : Mar 4, 2021, 4:56 PM IST

Updated : Mar 4, 2021, 5:05 PM IST

భారత స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన హర్షద్‌మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్‌సిరీస్‌ 'స్కామ్‌ 1992'. స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణం నేపథ్యంలో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. గతేడాది ఈ సిరీస్‌ ఎంతగానో అలరించింది. హన్సల్‌ మెహతా దర్శకత్వం వహించారు. కాగా.. మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధమయ్యారు. 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం కథను ఈసారి తెర మీద చూపించనున్నారు. స్కామ్‌ 1992 రెండవ సీజన్‌గా 'స్కామ్‌2003: ది క్యూరియస్‌ కేస్‌ ఆఫ్‌ అబ్దుల్‌ కరీమ్‌ తెల్గీ'ని తీసుకురాబోతున్నాంటూ ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ తెలిపింది.

abdul
అబ్దుల్‌ కరీం తెల్గీ

ఈ నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణం 2003లో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో అబ్దుల్‌ కరీం తెల్గీ అనే వ్యక్తి విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు కూడబెట్టినట్లు తేలింది. కుంభకోణం విలువ దాదాపు రూ.20వేల కోట్లు ఉంటుందని అంచనా. సంజయ్‌సింగ్‌ అనే జర్నలిస్టు అప్పట్లో ఈ మోసాన్ని బహిర్గతం చేశారు. 'రిపోర్టర్‌ కి డైరీ' అనే పేరుతో ఒక పుస్తకం కూడా రాశారు. ఆ పుస్తకం ఆధారంగానే ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారట.

కర్ణాటకలోని ఖానాపూర్ నుంచి వచ్చిన ఓ సాదాసీదా వ్యక్తి ఇంత తెలివిగా ఎలా ఆలోచించగలిగాడు..? అంత సులువుగా అందర్నీ ఎలా మోసం చేశాడు..? అనేదే ఈ వెబ్‌సిరీస్‌ కథాంశం. ఈ ఏడాది చివరికల్లా చిత్రీకరణ పూర్తిచేసి 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలున్నాయి. కాగా ఈ సిరీస్‌లో కనిపించనున్న నటీనటుల గురించి ఇంకా ప్రకటించలేదు. కాగా.. స్కామ్‌ 1992లో ప్రధాన పాత్ర పోషించిన ప్రతీక్‌గాంధీకి ఆ వెబ్‌సిరీస్‌ ఒక మైలురాయిలా నిలిచింది. అందుకే.. ఈ సీజన్‌2లో అబ్దుల్‌ కరీంగా ఎవరిని చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

pratik
ప్రతీక్‌గాంధి

ఇదీ చూడండి: 'స్కామ్​ 1992' వెబ్​ సిరీస్​కు ఆ జాబితాలో అగ్రస్థానం

Last Updated : Mar 4, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.