ETV Bharat / sitara

25 ఏళ్ల యువకుడికి 60 ఏళ్ల భార్య ఉంటే?

author img

By

Published : Mar 4, 2021, 7:11 AM IST

వినూత్న హాస్యభరిత కథతో తీస్తున్న 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి' లాంఛనంగా మొదలైంది. ఇందులో పార్వతీశం, శ్రీలక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Savitri Wife Of Satyamurthy Movie Opening
25 ఏళ్ల యువకుడికి 60 ఏళ్ల భార్య ఉంటే?

పార్వతీశం కథానాయకుడిగా, దర్శకుడు చైతన్య కొండ తెరకెక్కిస్తున్న చిత్రం 'సావిత్రి వైఫ్‌ ఆఫ్‌ సత్యమూర్తి'. గోగుల నరేంద్ర నిర్మాత. నటి శ్రీలక్ష్మి హీరో భార్యగా నటిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశానికి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ క్లాప్‌ ఇచ్చారు.

"25ఏళ్ల కుర్రాడికి 60ఏళ్ల ఆవిడ భార్య ఎలా అయింది? అనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందిస్తున్నాం. కుటుంబ సమేతంగా చూసి, హాయిగా నవ్వుకోవచ్చు. ఈ కథకు పార్వతీశం అయితేనే బాగుంటాడనిపించి ఈ సినిమాకి తీసుకున్నాం. అతని కుమారులుగా శివారెడ్డి, సునీల్‌ శెట్టి కనిపిస్తారు" అని దర్శకుడు చైతన్య చెప్పారు.

"వైవిధ్యమైన మేనరిజమ్స్‌తో ఎన్నో వెరైటీ పాత్రలు చేశాను. చాలా రోజుల తర్వాత మళ్లీ అలాంటి విభిన్నమైన పాత్ర దక్కింది" అని నటి శ్రీలక్ష్మి అన్నారు. "కేరింత'తో నాకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అంతకన్నా గొప్ప పేరు తీసుకొస్తుందని నమ్మకంగా ఉంది" అని పార్వతీశం అన్నారు.

ఇది చదవండి: అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం: సందీప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.