ETV Bharat / sitara

సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్

తమిళ నటుడు సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆకాశం నీ హద్దురా'. తెలుగులో ఈ సినిమాలోని సూర్య పాత్రకు నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పాడు.

Satya Dev lent his voice for Surya Telugu dubbing in Aakaasam Nee HaddhuRa
సూర్య పాత్రకు సత్యదేవ్ డబ్బింగ్
author img

By

Published : Oct 2, 2020, 5:46 PM IST

తమిళ నటుడు సూర్య చిత్రానికి టాలీవుడ్‌ యువ కథానాయకుడు సత్యదేవ్‌ డబ్బింగ్‌ చెప్పాడు. సూర్య కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సూరరై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదల కాబోతుంది.

గతంలో సూర్య పలు చిత్రాలకు తానే తెలుగులో డబ్బింగ్‌ చెప్పినా.. ఈసారి మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని భావించాడట. దాంతో ఆ అవకాశం సత్యను వరించింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు. కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితాధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్‌ బాబు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రం వేసవిలో సందడి చేయాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 30న ఈ మూవీ విడుదలవనుంది. తన సినిమాల్లోని డైలాగులతో అందరినీ ఆకట్టుకునే సత్యదేవ్‌.. సూర్య పాత్రకు ఏ విధంగా డబ్బింగ్ చెప్తాడో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.